Betting Apps: బెట్టింగ్ యాప్స్‌పై దర్యాప్తు వేగవంతం..
ABN , Publish Date - Mar 31 , 2025 | 09:13 AM
బెట్టింగ్ భూతం.. ఎన్నో కుటుంబాలను నాశనం చేస్తోంది. ఎందరినో బలి తీసుకుంటుంది. బెట్టింగ్ యాప్‌లకు బానిసలుగా మారి.. అప్పుల పాలై.. చివరకు వాటిని తీర్చలేక ప్రాణాలు తీసుకుంటున్న వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతుంది. ఈజీ మనీకి అలవాటు పడి.. బెట్టింగ్ యాప్‌లు చేసే మాయలో చిక్కుకుని సర్వం పోగొట్టుకుని ఆఖరికి ప్రాణాలు కూడా తీసుకుంటున్నారు. ఈ తరహా ఘటనలు పెరగడంతో తెలంగాణ పోలీసులు బెట్టింగ్‌పై ఉక్కుపాదం మొపారు.

హైదరాబాద్: తెలంగాణ (Telangana) రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతున్న బెట్టింగ్ యాప్స్ (Betting Apps) వ్యవహారాన్ని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) సీరియస్ (Secious)గా తీసుకున్నారు. దర్యాప్తు వేగవంతం చేసేందుకు కీలక నిర్ణయం (Key Decision) తీసుకున్నారు. సిట్ (SIT) ఏర్పాటు చేశారు. బెట్టింగ్ యాప్స్ దర్యాప్తుకు ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటు చేస్తూ డీజీపీ జితేందర్ (DGP Jitender) ఆదేశాలు జారీ చేశారు. ఐజీ ఎం రమేష్‌ను నియామించారు. ఆయనతోపాటు ఎస్పీలు సింధు శర్మ, వెంకటలక్ష్మి, అదనపు ఎస్పీ చంద్రకాంత్, శంకర్‌లను సభ్యులుగా నియమించారు.ఇప్పటికే బెట్టింగ్ యాప్స్‌పై రెండు కేసులు నమోదు అయ్యాయి. హైదరాబాద్ పంజాగుట్టతోపాటు సైబరాబాద్ మియాపూర్‌లో కేసులు నమోదు అయ్యాయి. 25 మంది టాలీవుడ్, బాలీవుడ్, యూట్యూబర్స్, టీవీ యాంకర్లపై పోలీసులు కేసులు నమోదు చేశారు. రెండు కేసులను కూడా సిట్‌కు బదిలీ చేస్తూ ఆదేశాలు చేశారు. 90 రోజుల్లో పూర్తిస్థాయి నివేదిక అందించాలని సీట్‌ను డీజీపీ ఆదేశించారు.
Also Read..: నెల్లూరు వైసీపీలో టెన్షన్.. టెన్షన్..
బెట్టింగ్ భూతం..
కాగా బెట్టింగ్ భూతం.. ఎన్నో కుటుంబాలను నాశనం చేస్తోంది. ఎందరినో బలి తీసుకుంటుంది. బెట్టింగ్ యాప్‌లకు బానిసలుగా మారి.. అప్పుల పాలై.. చివరకు వాటిని తీర్చలేక ప్రాణాలు తీసుకుంటున్న వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతుంది. ఈజీ మనీకి అలవాటు పడి.. బెట్టింగ్ యాప్‌లు చేసే మాయలో చిక్కుకుని సర్వం పోగొట్టుకుని ఆఖరికి ప్రాణాలు కూడా తీసుకుంటున్నారు. ఈ తరహా ఘటనలు పెరగడంతో తెలంగాణ పోలీసులు బెట్టింగ్‌పై ఉక్కుపాదం మొపారు. దీనిలో భాగంగానే.. బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేసిన వెండితెర, బుల్లితెర సెలబ్రిటీలపై కేసులు నమోదు చేశారు.
ఈ కేసుల్లో టాలీవుడ్, బాలీవుడ్‌కు చెందిన 25 మంది ప్రముఖులు, యూట్యూబర్స్, టీవీ యాంకర్ల పేర్లు ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. ప్రస్తుతం నమోదైన రెండు కేసులను ప్రత్యేక దర్యాప్తు బృందానికి బదిలీ చేస్తూ అధికారిక ఆదేశాలు జారీ అయ్యాయి. 90 రోజుల్లోగా పూర్తిస్థాయి నివేదిక అందించాలని డీజీపీ జితేందర్ సిట్ బృందాన్ని ఆదేశించారు. ఈ దర్యాప్తుతో బెట్టింగ్ యాప్స్ వెనుక ఉన్న అసలు నెట్‌వర్క్‌ను బయటకు తీసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.
బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ వ్యవహారం టాలీవుడ్‌ను కుదిపేస్తున్నది. ఇప్పటికే పలువురు నటీనటులపై కేసు నమోదైన విషయం తెలిసిందే. ఇటీవల ఈ వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకున్నది. సీనియర్ నటుడు నందమూరి బాలకృష్ణ, ప్రభాస్, గోపీచంద్‌లపై కూడా కేసులు నమోదయ్యాయి. ఇమ్మాని రామారావు అనే వ్యక్తి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ముగ్గురు నటులు బెట్టింగ్ యాప్స్‌ని ప్రమోట్ చేసినట్లుగా ఆరోపించారు. ఓ టాక్ షోలో పాల్గొన్న సమయంలో అక్రమ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ నిర్వహించినట్లు ఆయన ఆరోపించారు. టాక్‌లో బాలకృష్ణ హోస్ట్‌గా వ్యవహరించగా.. స్పెషల్ ఎపిసోడ్‌లో ప్రభాస్, గోపీచంద్ కనిపించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఎగ్జామ్ లేకుండా IRCTCలో ఉద్యోగాలు..
నా రాజకీయ జీవిత కథను నేనే రాశా
For More AP News and Telugu News