Viral Video: ఫ్లైఓవర్ నుంచి పడిపోయిన కిరోసిస్ ట్యాంకర్.. క్షణాల్లోనే
ABN , Publish Date - Mar 31 , 2025 | 08:52 AM
ప్రశాంతంగా ఎవరి పనులు వారు చేసుకుంటూ.. బిజీ బిజగా గడుపుతున్న రోడ్డు మీదకు ప్రమాదం దూసుకువచ్చింది. ఫ్లైఓవర్ నుంచి ఓ ట్యాంకర్ కింద పడింది. భయపడిన జనాలు అక్కడ నుంచి పరిగెత్తుకెళ్లారు. ఈ సంఘటన ఎక్కడ జరిగిందంటే..

ముంబై: రోడ్డు ప్రమాదాల వల్ల ఎందరో ప్రాణాలు కోల్పోతున్నారు.. ఎన్నో వందల కుటుంబాలు నావనం అవుతున్నాయి. ఇక మన సమాజంలో నిత్యం ఏదో ఒక చోట రోడ్డు ప్రమాదం సంభవించడం.. ప్రయాణికులు, వాహనదారులు మృత్యువాత పడటం సర్వ సాధారణం అయ్యింది. ఇక కొన్ని ప్రమాదాలు మరింత దారుణంగా ఉంటాయి. వాటిల్లో అత్యంత భయంకరమైనవి.. భారీ వాహనాలు అదుపు తప్పి జనావాసాల్లోకి దూసుకురావడం, బ్రిడ్జీలు, ఫ్లైఓవర్ వంతెనల నుంచి కిందకు పడటం వంటివి. ఈ మధ్య కాలంలో ఇలాంటి ఘటనలు తరచుగా చోటు చేసుకుంటున్నాయి. తాజాగా ఈ కోవకు చెందిన సంఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. కిరోసిన్ ట్యాంకర్ ఒకటి ఫ్లైఓవర్ నుంచి కిందకు పడిపోయిన ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ అవుతుంది. ఆ వివరాలు..
ఈ సంఘటన మహారాష్ట్రలో వెలుగు చేసింది. ఆదివారం సాయంత్రం.. 5 గంటల ప్రాంతంలో కిరోసిస్ ట్రక్కు ఒకటి ముంబై-అహ్మాదాబాద్ హైవే ఫ్లైఓవర్ నుంచి కిందకు పడిపోయింది. పల్గార్ మనోల్ ప్రాంతంలోని మాసన్ నాక ప్రాంతంలో ఈ ఘటన వెలుగు చూసింది. ట్యాంకర్ కింద పడిన వెంటనే దానిలోని కిరోసిన్ ఆ ప్రాంతం అంతా వ్యాపించింది. క్షణాల వ్యవధిలో మంటలు అంటుకున్నాయి. నల్ల కిరోసిన్ రోడ్డు అంతా పరుచుకుంది.
బిజీ రోడ్డులోకి ట్రక్కు దూసుకురావడం గమనించిన జనాలు.. భయంతో అక్కడ నుంచి పారిపోయారు. డ్రైవర్ నియంత్రణ కోల్పోడం వల్లనే ఈ ప్రమాదం చోటు చేసుకుందని భావిస్తున్నారు. కిందపడిన వెంటనే ట్రక్కులో మంటలో వ్యాపించాయి. విషయం తెలుసుకున్న అధికారులు వెంటనే సంఘటనా స్థలికి చేరుకుని.. కిరోసిన్‌ని శుభ్రం చేసే చర్యలు ప్రారంభించారు. మంటలను ఆర్పి వేశారు. ముందు జాగ్రత్త చర్యగా జనాలను అక్కడ నుంచి దూరంగా పంపించి వేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
వైకల్యాన్ని జయించి.. ఐఐఐటీలో సీటు సాధించాడు.. కానీ
ఏఐ జమానాలో అత్యధిక జీతాలు ఉన్న ఉద్యోగాలు ఇవే