MP Balram Naik : కేసీఆర్ ప్రభుత్వంలో అలా చేశారు.. బలరామ్ నాయక్ షాకింగ్ కామెంట్స్

ABN, Publish Date - Mar 17 , 2025 | 08:28 PM

MP Balram Naik : రేవంత్ ప్రభుత్వంలో రైతులకు బోనసులు కూడా ఇచ్చామని మహబూబాబాద్ కాంగ్రెస్ ఎంపీ బలరామ్ నాయక్ అన్నారు. సీఆర్ హయాంలో మహిళలపై ఎస్సీ, ఎస్టీ కేసులు పెట్టారని ఎంపీ బలరామ్ నాయక్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

MP Balram Naik : కేసీఆర్ ప్రభుత్వంలో అలా చేశారు.. బలరామ్ నాయక్ షాకింగ్ కామెంట్స్
MP Balram Naik

ఢిల్లీ: తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి మీద బీఆర్ఎస్ నేతలు లేని పోని నిందలు వేస్తున్నారని మహబూబాబాద్ కాంగ్రెస్ ఎంపీ బలరామ్ నాయక్ ఆరోపణలు చేశారు. ఇవాళ(సోమవారం)ఢిల్లీ వేదికగా బలరామ్ నాయక్ మీడియాతో మాట్లాడారు. మీడియా సోదరులు ప్రజా సేవకులని తెలిపారు. సీఎం రేవంత్‌రెడ్డి జర్నలిస్టులను ఒక్క మాట కూడా అనలేదని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులకు బోనస్ ఇచ్చామని గుర్తుచేశారు. మహిళలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నామని అన్నారు. రైతులకు బేడీలు వేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం కాదా అని ప్రశ్నించారు.అప్పుల పాలైన తెలంగాణను అభివృద్ధి చేయడానికి సీఎం రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నారని కాంగ్రెస్ ఎంపీ బలరామ్ నాయక్ చెప్పారు.


ఇచ్చిన అన్ని హామీలను, గ్యారెంటీలను అమలు చేస్తున్నామని తెలిపారు. బీఆర్ఎస్ నేతలు అందరితో సీఎం రేవంత్‌రెడ్డిని తిట్టిస్తున్నారని ధ్వజమెత్తారు. సీఎం రేవంత్‌రెడ్డిని ఇబ్బంది పెట్టే విధంగా బీఆర్ఎస్ నేతలు వ్యవహారిస్తున్నారని మడిపడ్డారు. తెలంగాణలో అప్పులు ఉన్నప్పటికీ ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నామని తెలిపారు. కాస్మోటిక్స్, మెస్ చార్జీలను కూడా రేవంత్ ప్రభుత్వం పెంచిందని కాంగ్రెస్ ఎంపీ బలరామ్ నాయక్ తెలిపారు.


రైతులకు బోనసులు కూడా ఇచ్చామని అన్నారు. తెలంగాణ ప్రజల సంక్షేమానికి, రాష్ట్ర అభివృద్ధికి అన్ని విధాలా పని చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డిపై ఇలాంటి నిందలు వేయడం బీఆర్ఎస్ నేతలకు సరికాదన్నారు. తాము బీఆర్ఎస్ నేతలపై ఎలాంటి అక్రమ కేసులు పెట్టలేదని చెప్పారు. తెలంగాణ కోసం కష్టపడి పనిచేసిన తమపైనే కేసీఆర్ ప్రభుత్వం ఆక్రమ కేసులు పెట్టిందని విమర్శలు చేశారు. కేసీఆర్ హయాంలో మహిళలపై ఎస్సీ, ఎస్టీ కేసులు పెట్టారని ఎంపీ బలరామ్ నాయక్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి...

CM Revanth Reddy: అసెంబ్లీలో బీసీ రిజర్వేషన్ బిల్లు.. సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

KTR criticizes Congress govt: కాంగ్రెస్ పాలన ఫలితమే ఇదీ.. కేటీఆర్ ఫైర్

Hyderabad: ఛీ.. మీరసలు మనుషులేనా.. ఇంత దారుణమా..

For Telangana News And Telugu News

Updated Date - Mar 17 , 2025 | 08:31 PM