Share News

ఆలయంలో నిలిచిన పూజలు

ABN , Publish Date - Apr 15 , 2025 | 12:19 AM

యాదాద్రిభువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలంలోని దాతరుపల్లి గ్రామంలోని ప్రసన్న వేంకటేశ్వర స్వామి ఆలయంలో రెండు రోజుల నుంచి పూజలు నిర్వహించడం లేదు.

ఆలయంలో నిలిచిన పూజలు
దేవాలయం వద్ద పహార కాస్తున్న పోలీసులు

బ్రహ్మోత్సవాల నిర్వహణపై ధర్మకర్త, గ్రామస్థుల మధ్య వివాదం

యాదగిరిగుట్ట రూరల్‌, ఏప్రిల్‌ 14, (ఆంధ్రజ్యోతి): యాదాద్రిభువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలంలోని దాతరుపల్లి గ్రామంలోని ప్రసన్న వేంకటేశ్వర స్వామి ఆలయంలో రెండు రోజుల నుంచి పూజలు నిర్వహించడం లేదు. స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల విషయంలో ఆలయ ధర్మకర్త మూల రాజు, మధ్య గ్రామస్థుల వారం రోజులుగా వివాదం నెలకొంది. దీంతో ఈ నెల 13వ తేదీ నుంచి 15వరకు జరగాల్సిన బ్రహ్మోత్సవాలు వాయిదా పడ్డాయి. 23 సంవత్సరాలుగా స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలను గ్రామస్థుల నుంచి డబ్బులు వసూలు చేయకుండా తానే నిర్వహిస్తున్నానని ధర్మకర్త మూల రాజు వాదిస్తు న్నారు. తమను విస్మరించి ధర్మకర్త రాజు వంటెద్దు పోకడతో తమను విస్మరిస్తు న్నాడని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. బ్రహ్మోత్సవాలకు మరో తేదీ ఖరారు చేసి నిర్వహించాలని గ్రామస్థులు పట్టుపట్టారు. అనంతరం పోలీసులను ఆశ్రయిం చారు. ఇరు వర్గాలు చర్చించుకొని ఓ నిర్ణయం తీసుకొని బ్రహ్మోత్సవాలు నిర్వహించుకోవాలని పోలీసులు సూచించారు. శని, ఆదివారం పోలీసులు ఆలయం వద్దే పహారా కాశారు. వాయిదాపడిన బ్రహ్మోత్సవాలను ధర్మకర్త, ఆయన అనుచరులు, గ్రామస్థులు కలిసి నిర్వహిస్తారా? పూర్తిగా వాయిదా పడతాయా అని చర్చ జరుగుతోంది. బ్రహ్మోత్సవాల నిర్వహణ విషయంలో మూలరాజు తమపై చిన్నచూపు చూడడంతో వివాదం నెలకొందని గ్రామస్థులు బత్తిని బాలరాజు, బైరగాని పాండు, శేఖర్‌ ఆరోపించారు. గ్రామస్థుల సమష్ఠి నిర్ణయంతో అందరూ కలిసి సమయం తీసుకొని తేదీ ఖరారు చేసి బ్రహ్మోత్స వాలు నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నామని వారు తెలిపారు.

Updated Date - Apr 15 , 2025 | 12:19 AM