Hyderabad: వామ్మో.. రూ. 12.59 లక్షలు కొట్టేశారుగా.. అసలేం జరిగిందంటే..
ABN, Publish Date - Jan 05 , 2025 | 09:34 AM
ట్రేడింగ్‌లో పెట్టుబడులు పెడితే రెట్టింపు లాభాలంటూ ఓ ప్రైవేట్ ఉద్యోగిని నమ్మించిన సైబర్ నేరగాళ్లు(Cyber criminals) రూ.12.59లక్షలు కొల్లగొట్టారు. మోసపోయినట్లు గుర్తించిన బాధితుడు సిటీ సైబర్‌క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
- రూ. 12.59 లక్షలు స్వాహా
- ట్రేడింగ్‌లో రెట్టింపు లాభాలంటూ సైబర్ మోసం
హైదరాబాద్ సిటీ: ట్రేడింగ్‌లో పెట్టుబడులు పెడితే రెట్టింపు లాభాలంటూ ఓ ప్రైవేట్ ఉద్యోగిని నమ్మించిన సైబర్ నేరగాళ్లు(Cyber criminals) రూ.12.59లక్షలు కొల్లగొట్టారు. మోసపోయినట్లు గుర్తించిన బాధితుడు సిటీ సైబర్‌క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. నగరానికి చెందిన 39 ఏళ్ల ప్రైవేట్ ఉద్యోగికి ఫేస్‌బుక్‌లో ఎస్‌ఎంసీ గ్లోబల్ సెక్యూరిటీస్ లిమిటెడ్ పేరుతో ఆన్‌లైన్ ట్రేడింగ్(Online trading) ప్రకటన కనిపించింది. బాధితుడు ప్రకటనలోని నంబర్‌కు కాంటాక్టు చేశాడు.
ఈ వార్తను కూడా చదవండి: Niharika Konidela: సినిమాలో కథ, కథనం బాగుంటేనే ఆదరణ
వెంటనే లైన్‌లోకి వచ్చిన వ్యక్తి ఎస్‌ఎంసీ గ్లోబల్ సెక్యూరిటీస్ సంస్థ హెచ్‌ఆర్ ప్రతినిధిగా పరిచయం చేసుకుని, బాధితుడి నుంచి అన్ని వివరాలు తీసుకున్నాడు. ఆన్‌లైన్ ట్రేడింగ్, స్టాక్ మార్కెట్‌పై మెళకువలు నేర్పిస్తామని తెలిపాడు. అనంతరం ట్రేడింగ్‌లో పెట్టుబడులు పెడితే రెట్టింపు లాభాలు వస్తాయని చెప్పి బాధితుడి పేరుతో యూజర్ ఐడీని క్రియేట్ చేసి పెట్టుబడులు పెట్టించాడు. అయితే, పెట్టిన డబ్బులకు ట్రేడింగ్(Trading)లో రెట్టింపు లాభాలు వస్తున్నట్లు వర్చువల్‌గా చూపించాడు.
ఎక్కువ మొత్తంలో లాభాలు వచ్చిన తర్వాత ఒకేసారి విత్‌డ్రా చేసుకోవచ్చని నమ్మించాడు. అలా విడతలవారీగా రూ. 12,59,288 పెట్టుబడిగా పెట్టించాడు. ఆ తర్వాత విత్‌డ్రా ఆప్షన్ తొలగించి స్పందించడం మానేశారు. దాంతో మోసపోయినట్లు గుర్తించిన బాధితుడు సిటీ సైబర్‌క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు సాంకేతిక ఆధారాలతో కేసు దర్యాప్తు చేస్తున్నారు.
ఈవార్తను కూడా చదవండి: ‘తెలుగు‘లో చదివితే ఉద్యోగాలు రావన్నది అపోహే
ఈవార్తను కూడా చదవండి: KTR: కేంద్రంలో చక్రం తిప్పుతాం
ఈవార్తను కూడా చదవండి: DK Aruna: చట్టసభల్లో మహిళల సంఖ్య పెరగాలి
ఈవార్తను కూడా చదవండి: ఖమ్మం అభివృద్ధిపై మంత్రి తుమ్మల కీలక నిర్ణయాలు
Read Latest Telangana News and National News
Updated Date - Jan 05 , 2025 | 09:34 AM