ప్రారంభమైన తెలంగాణ అసెంబ్లీ

ABN, Publish Date - Mar 15 , 2025 | 10:28 AM

Telangana Assembly Session: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు మూడో రోజుకు చేరుకున్నారు. ఈ సందర్భంగా బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి సస్పెన్షన్‌ను పున:పరిశీలించాలని స్పీకర్‌ను ఆ పార్టీ ఎమ్మెల్యే హరీష్ రావు వినతి చేశారు.

హైదరాబాద్, మార్చి 15: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ( Telangana Assembly Session) మూడో రోజు ప్రారంభమయ్యాయి. సభ మొదలవగానే ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి (MLA Jagadish Reddy) సస్పెన్షన్ అంశాన్ని సభలో లేవనెత్తారు ఆ పార్టీ ఎమ్మెల్యేలు. జగదీష్ రెడ్డిపై సస్పెన్షన్‌ను ఎత్తివేయాలని, స్పీకర్ పునర్ పరిశీలించాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు (MLA Harish Rao) విజ్ఞప్తి చేశారు. ‘జగదీష్ రెడ్డి మిమ్మల్ని ఏకవచనంతో మాట్లాడలేదు. స్పీకర్ అంటే మాకు గౌరవం ఉంది. జగదీష్ రెడ్డికి మాట్లాడే అవకాశం ఇస్తే బాగుండేది’ అని హరీష్ తెలిపారు. ఆ తరువాత గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ కొనసాగుతోంది. గవర్నర్ ప్రసంగంపై కాంగ్రెస్ ఎమ్మెల్యే రాంచంద్ర నాయక్ మాట్లాడుతున్నారు.


అలాగే గవర్నర్ ప్రసంగంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమాధానం ఇవ్వనున్నారు. ఆపై పొట్టి శ్రీరాములు యూనివర్సిటీ చట్ట సవరణ బిల్లును అసెంబ్లీలో సీఎం ప్రవేశపెట్టనున్నారు. పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీకి సురవరం ప్రతాప్ రెడ్డి పేరును ఖరారు చేసిన విషయం తెలిసిందే. విభజన చట్టంలో భాగంగా 10 ఏళ్లు పూర్తైన నేపథ్యంలో పేరు మార్పు చేయాలని సర్కార్ నిర్ణయించింది.


ఇవి కూడా చదవండి...

Singarakonda Tirunallu:కనుల పండువగా సింగరకొండ తిరునాళ్లు

justice for Viveka: ఆరు ఏళ్లుగా పోరాడుతున్నా.. వివేకా కుమార్తె కన్నీరు

Read Latest Telangana News And Telugu News

Updated at - Mar 15 , 2025 | 10:31 AM




News Hub