మీ ఇంట్లో ఆడవాళ్లనంటే ఊరుకుంటారా

ABN, Publish Date - Mar 15 , 2025 | 04:53 PM

CM Revanth Comments: సోషల్ మీడియాలో రాజకీయ నేతల కుటుంబాలకు సంబంధించి అనుచిత వ్యాఖ్యలు చేయడంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఆడబిడ్డల గురించి మాట్లాడే సంస్కృతి ఎక్కడి నుంచి వచ్చిందంటూ ఫైర్ అయ్యారు.

హైదరాబాద్, మార్చి 15: బీఆర్‌ఎస్ సోషల్ మీడియాపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తెలంగాణ శానససభలో సీఎం మాట్లాడుతూ.. ఫ్యామిలీ జోలికి రావొద్దంటూ హెచ్చరించారు. ‘మీ అమ్మ, చెల్లి, భార్యను ఇలాగే అంటే ఊరుకుంటావా. నా భార్య, నా బిడ్డను తిడితే నాకు బాధ వస్తది. ఓ ఆడపిల్లను అవమానిస్తే నీకు బాధ కాదా. ఏ సంస్కృతిలో ఉన్నారంటూ’ ఫైర్ అయ్యారు. ఒక్కొక్కరి తోడ్కలు తీస్తానంటూ వార్నింగ్ ఇచ్చారు. ప్రజా జీవితంలో ఉన్నది తాము అని.. తమను విమర్శించడంలో తప్పులేదన్నారు. నేతల గురించి మాట్లాడాలే తప్ప వారి ఇంట్లో ఉన్న ఆడబిడ్డల గురించి మాట్లాడే సంస్కృతి ఎక్కడి నుంచి వచ్చిందని సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.


ఇవి కూడా చదవండి...

Justice for Viveka: ఆరు ఏళ్లుగా పోరాడుతున్నా.. వివేకా కుమార్తె కన్నీరు

Turmeric farmers crisis: పసుపు రైతుల పరిస్థితి ఇదీ.. ఆదుకోండి ప్లీజ్

గర్ల్ ఫ్రెండ్‎కి సర్ప్రైజ్ ఇచ్చిన బాయ్ ఫ్రెండ్

Read Latest Telangana News And Telugu News

Updated at - Mar 15 , 2025 | 04:53 PM




News Hub