CM Revanth Reddy : రొయ్యల పులుసుకు ఆశపడి, మా గుండెల మీద తంతావా

ABN, Publish Date - Mar 15 , 2025 | 02:55 PM

తెలంగాణ అసెంబ్లీలో బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌పై సీఎం రేవంత్‌రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పాలమూరుకు కేసీఆర్ ఎంతో అన్యాయం చేశారని సీఎం రేవంత్‌రెడ్డి మండిపడ్డారు.

తెలంగాణ అసెంబ్లీలో బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌పై సీఎం రేవంత్‌రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పాలమూరుకు కేసీఆర్ ఎంతో అన్యాయం చేశారని మండిపడ్డారు. పాలమూరు అభివృద్ధిని కేసీఆర్ నిర్లక్ష్యం చేశారని ధ్వజమెత్తారు. గత జగన్ ప్రభుత్వం పర్యావరణ అనుమతులు లేకుండా ఏపీలో ప్రాజెక్ట్‌లు కడుతుందని సామాన్య రైతు గవినోళ్ల శ్రీనివాస్ చైన్నెలోని నేషనల్ గ్రీన్ ట్రిబ్యూనల్‌లో స్టే వేయించారని సీఎం రేవంత్‌రెడ్డి గుర్తుచేశారు.


అయితే రైతులు పోరాడుతుంటే బీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రం పట్టించుకోలేదని మండిపడ్డారు. మాజీ మంత్రి ఆర్కే రోజా ఇంటికి వెళ్లింది ఎవరని ప్రశ్నించారు. రోజా ఇంటికి కేసీఆర్ వెళ్లలేదా అని నిలదీశారు. రోజా ఇంటికి వెళ్లి రొయ్యల పులుసు తిని తెలంగాణకు కేసీఆర్ అన్యాయం చేశారని విమర్శించారు. ఆ తర్వాత రాయలసీమను రతనాల సీమ చేస్తానని కేసీఆర్ చెప్పలేదా అని సీఎం రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు.

మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి..

Updated at - Mar 15 , 2025 | 02:59 PM




News Hub