సీఎంతో వంగవీటి రాధా భేటీ..చర్చించిన అంశాలు ఇవే
ABN, Publish Date - Apr 02 , 2025 | 09:24 PM
సీఎం చంద్రబాబుతో వంగవీటి రాధా భేటీ అయ్యారు. ఇటీవల ఎమ్మెల్సీల జాబితాలో వంగవీటి రాధా పేరు లేదు. దీంతో ఆయన అనుచర వర్గం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబును వంగవీటి రాధా కలవడం ప్రాధాన్యత సంతరించుకొంది. 2019లో.. అది ఎన్నికల సమయంలో వైసీపీ అధినేత వైఎస్ జగన్‌తో రాధా విబేధించారు. దీంతో ఆయన టీడీపీలో చేరారు.
సీఎం చంద్రబాబుతో వంగవీటి రాధా బుధవారం అమరావతిలో భేటీ అయ్యారు. ఇటీవల ఎమ్మెల్సీల జాబితాలో వంగవీటి రాధా పేరు లేదు. దీంతో ఆయన అనుచర వర్గం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబును వంగవీటి రాధా కలవడం ప్రాధాన్యత సంతరించుకొంది. 2019లో.. అది ఎన్నికల సమయంలో వైసీపీ అధినేత వైఎస్ జగన్‌తో రాధా విబేధించారు. దీంతో ఆయన టీడీపీలో చేరారు.
నాటి నుంచి ఆయన టీడీపీలోనే ఉన్నారు. కానీ ఆయనకు రాజకీయ పదవి ఏదీ లభించ లేదు. గతేడాది జరిగిన ఎన్నికల్లో కూటమిలోని పార్టీల విజయం కోసం ఆయన కృషి చేశారు. అలాగే కూటమి అధికారంలోకి వస్తే.. పదవి ఇస్తానని చంద్రబాబు భరోసా ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇక ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఐదు స్థానాల్లో ఒకటి రాధాకు కేటాయిస్తారని ప్రచారం జరిగింది. కానీ ఆ పదవి ఆయనకు కేటాయించ లేదు. దీంతో ఆయన వర్గం తీవ్ర కలత చెందినట్లు సమాచారం.
Updated at - Apr 02 , 2025 | 09:24 PM