అనకాపల్లి ఘటనపై సీఎం చంద్రబాబు దిగ్బ్రాంతి..
ABN, Publish Date - Apr 13 , 2025 | 07:22 PM
అకనాపల్లి జిల్లాలో విషాదం చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. బాణ సంచా తయారీ కేంద్రంలో భారీ అగ్ని ప్రమాదం కారణంగా ఎనిమిది మంది కార్మికులు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ సంఘటనపై సీఎం చంద్రబాబు స్పందిస్తూ దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు.
అకనాపల్లి జిల్లాలో ఘోర ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. బాణ సంచా తయారీ కేంద్రంలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుని 8 మంది కార్మికులు మృతి చెందారు. ఈ ఘటనపై సీఎం చంద్రబాబు స్పందిస్తూ దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. వెంటనే సంబంధిత అధికారులతో ఫోన్ లో మాట్లాడారు. ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన వైద్య సేవలందించాలని ఆదేశించారు . కాగా, మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందన్న ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
Updated at - Apr 13 , 2025 | 07:23 PM