US China Trade Tar: ముదిరిన అమెరికా-చైనా ట్రేడ్ వార్..

ABN, Publish Date - Apr 10 , 2025 | 06:16 PM

China: ప్రపంచంలోని ఇతర దేశాల కంటే తమ దేశంపై అత్యధిక సుంకాలు విధించడంపై డ్రాగన్ దేశం స్పందించింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కవ్వింపు చర్యలకు భయపడేదే లేదని తేల్చిచెప్పడంతో.. రెండు దేశాల మధ్య వివాదం మరింత ముదిరినట్లయింది.

China : ప్రపంచంలో చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అన్ని దేశాలపై సుంకాల మోత మోగించాడు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. మరీ ముఖ్యంగా డ్రాగన్ దేశంపైనే అత్యధికంగా 125 శాతం పన్ను విధించాడు. ఈ నిర్ణయం రెండు అతి పెద్ద ఆర్థిక వ్యవస్థల మధ్య వాణిజ్య యుద్ధానికి ఆజ్యం పోసింది. ఈ క్రమంలోనే చైనా అమెరికాకు ధీటుగా బదులిచ్చింది. ఎంతగా ఇబ్బందిపెట్టినా ట్రంప్ టెంపరితనానికి తాము లొంగేదే లేదని స్పష్టం చేసింది.

Updated at - Apr 10 , 2025 | 06:16 PM