Home » ABN
లోక్ సభ ఎన్నికల వేళ రాజస్థాన్ భారతీయ జనతా పార్టీకి గట్టి షాక్ తగిలింది. ఆ పార్టీ సీనియర్ నేత ప్రహ్లాద్ గుంజల్ రాజీనామా చేశారు. ప్రహ్లాద్ గుంజల్ ఉత్తర కోటాలో బీజేపీకి బలమైన నేత. ప్రహ్లాద్ గుంజల్ గురువారం నాడు (ఈ రోజు) కాంగ్రెస్ పార్టీలో చేరారు. బీజేపీ ముఖ్య నేత, రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి వసుంధర రాజేకు ప్రహ్లాద్ గుంజల్ కీలక అనుచరుడు.
హెచ్ఎండిఏ కృష్ణకుమార్ కేసులో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ మేరకు కృష్ణకుమార్, శివబాలకృష్ణ అక్రమాలపై ఏసీబీ ఆరా తీస్తోంది. కృష్ణకుమార్ ను ఇప్పటికే ప్రభుత్వం సస్పెండ్ చేసింది.
లోక్ సభ ఎన్నికల వేళ అధికార బీజేపీకి బిగ్ షాక్ తగిలింది. కర్ణాటక ముఖ్యమంత్రిగా సేవలందించిన బీజేపీ ( BJP ) నేత డీవీ సదానంద గౌడ రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు.
తప్పుడు ప్రకటనల కేసులో కోర్టుకు సమాధానం చెప్పాలంటూ పతంజలి ఆయుర్వేదాన్ని దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ( Supreme Court ) ఆదేశించిన తరుణంలో కంపెనీ కీలక ప్రకటన చేసింది.
మొదటి దశ లోక్ సభ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైంది. దీంతో మొదటి విడతలో ఎన్నికలు ( Elections ) జరిగే ప్రాంతాల్లో నామినేషన్ పత్రాల సేకరణ ప్రక్రియ ప్రారంభమైంది. అభ్యర్థులు డిపాజిట్ కట్టి తమ అభ్యర్థిత్వాన్ని నామినేషన్ చేయించుకుంటున్నారు.
దేశ రాజధాని దిల్లీలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. గురువారం తెల్లవారుజామున ఈశాన్య దిల్లీ ( Delhi ) లోని కబీర్ నగర్లో రెండంతస్తుల భవనం కుప్పకూలింది. ఈ ఘటనలో శిథిలాల కింద చిక్కుకుని ఇద్దరు మృత్యువాత పడ్డారు.
బౌద్ధ క్షేత్రం సమీపంలో మైనింగ్‌కు అనుమతులు ఇవ్వడంపై హైకోర్ట్ ఆగ్రహం వ్యక్తం చేసింది. అక్కడ అంత హడావుడిగా ఎందుకు అనుమతి ధర్మాసనం ప్రశ్నించింది. కొడవలి బౌద్ధ క్షేత్రం సమీపంలో గ్రావెల్ తవ్వకాలకు అనుమతులు ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో బౌద్ధ స్తూప పరిరక్షణ సమితి నేత రామేశ్వర రావు పిటిషన్ వేశారు. ఆ పిటిషన్ బుధవారం నాడు ధర్మాసనం విచారించింది.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమికి లోక్ సత్తా అధినేత జయప్రకాశ్ నారాయణ మద్దతు ప్రకటించారు. ఎన్డీఏతో కలిసి పనిచేస్తామని, రాష్ట్రం నుంచి అరాచక పాలనను తరిమికొడతామని ప్రకటించారు. తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీ కూటమికి జయప్రకాశ్ నారాయణ మద్దతు తెలుపడాన్ని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్వాగతించారు.
ఆంధ్రప్రదేశ్‌లో ఎస్సీ, ఎస్టీలు లక్ష్యంగా వైసీపీ శ్రేణులు దాడులకు తెగబడుతున్నారని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య మండిపడ్డారు. దళితులను బెదిరించి ఓట్లు దండుకోవాలని వైసీపీ నేతలు చూస్తున్నారని వర్ల రామయ్య ఆరోపించారు. ప్రత్తిపాడులో వాలంటీర్లతో వైసీపీ అభ్యర్థి బాలసాని కిరణ్ కుమార్ సమావేశం కావడం ఎన్నికల కమిషన్ నియమావళికి విరుద్దం అని తెలిపారు. ఆ అంశాన్ని మాజీ ఐఏఎస్, దళితుడు రామాంజనేయులు ప్రశ్నిస్తే దాడికి తెగబడ్డారని వర్ల రామయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమక్షంలో జనసేన పిఠాపురం మాజీ ఇంచార్జీ మాకినీడి శేషుకుమారి బుధవారం నాడు వైసీపీలో చేరారు. 2019 ఎన్నిలక్లో శేషుకుమారి పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి, ఓడిపోయారు. ఆ తర్వాత జనసేన పార్టీలో క్రియాశీలకంగా పనిచేశారు. పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి జనసేన అధినేత పవన్ కల్యాణ్ బరిలోకి దిగుతున్నారు. ఈ సారి జనసేన టికెట్ దక్కే అవకాశం లేదు.