Home » ACB
మలక్ పేట్, బండ్లగూడా, టోలిచౌకి, రంగారెడ్డి, సిద్దిపేట, కరీంనగర్, నల్లగొండ, మహబూబ్‌నగర్, మహబూబాబాద్ జిల్లాలో ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తున్నారు. సాలూరు చెక్ పోస్ట్ నిజామాబాద్, భోరజ్ చెక్ పోస్ట్ ఆదిలాబాద్, అశ్వరావు పేట చెక్ పోస్ట్ ఖమ్మంలోను తనిఖీలు చేపట్టారు.
హైదరాబాద్: ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారనే ఆరోపణల నేపథ్యంలో అరస్టయి, రిమాండ్‌లో ఉన్న ఏసీపీ ఉమామహేశ్వరరావును కస్టడీ కోరుతూ ఏసీబీ అధికారులు నాంపల్లి కోర్టులో పిటిషన్ వేశారు. 8 రోజులు కస్టడీకి ఇవ్వాలని కోరారు. దీనిపై శుక్రవారం న్యాయస్థానం విచారణ చేయనుంది.
ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్టయిన సీసీఎ్‌స(ఈవోడబ్ల్యూ) ఏసీపీ ఉమామహేశ్వరరావును ఏసీబీ అధికారులు బుధవారం ఏసీబీ కేసుల ప్రత్యేక న్యాయస్థానంలో హాజరుపరిచారు.
ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో సీసీఎస్ ఏసీపీ ఉమామహేశ్వరరావును అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. ఉమామహేశ్వరరావును ఏసీబీ అధికారులు అరెస్ట్ చేయడంతో బాధితులు ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారు. తమను మోసం చేశారంటే.. తమను ఛీట్ చేశారంటూ బాధితులు బయటకు వస్తున్నారు. ఇన్నాళ్లూ తాము భయపడి ముందుకు రాలేదని స్పష్టం చేశారు.
నగరంలోని పలుచోట్ల ఏసీబీ (ACB) అధికారులు మంగళవారం సోదాలు నిర్వహిస్తున్నారు. సీసీఎస్ ఏసీపీ ఉమామహేశ్వరరావు ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారన్న ఆరోపణలతో ఆయనకు సంబంధించిన పది ప్రాంతాల్లో ఏసీబీ సోదాలు నిర్వహిస్తోంది.
హైదరాబాద్: నగరంలోని పలు చోట్ల ఏసీబీ అధికారులు సోదాలు చేపట్టారు. సీసీఎస్ ఏసీపీ ఉమా మహేశ్వర రావు ఇంట్లో మంగళవారం ఉదయం సోదాలు చేస్తున్నారు. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారని ఆరోపణలు రావడంతో ఏసీబీ సోదాలు చేస్తోంది.
రాష్ట్రంలోని పలువురు ప్రభుత్వ ఉద్యోగులు లంచాలు తీసుకుంటూ సోమవారం అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ)కి చిక్కారు. ఇంటి నెంబరు కేటాయించేందుకు రూ.35 వేలు లంచం తీసుకుంటూ రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం నానాజీపూర్ గ్రామ పంచాయతీ కార్యదర్శి రాధిక, ఆమెకు సహకరించిన బిల్ కలెక్టర్ బాల్‌రాజ్ ఏసీబీకి పట్టుబడ్డారు.
ఏపీ ఏసీబీ కోర్టులో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, యువనేత నారా లోకేష్ (Nara Lokesh) రెడ్ బుక్ కేసుపై బుధవారం విచారణ జరిగింది. నారా లోకేష్‌ను అరెస్ట్ చేయాలని ఏపీ సీఐడీ వేసిన పిటిషన్‌పై ఏసీబీ కోర్టు విచారణ చేపట్టింది.
గత ప్రభుత్వంలో అధికార దుర్వినియోగానికి పాల్పడినట్లు నిర్దారించి హెచ్ఎండీఏ(HMDA)లో అడ్మినిస్ర్టేటివ్ నిర్వహణ చేపట్టే కీలక రెవెన్యూ అధికారికి ఏసీబీ అధికారులు నోటీసులు జారీ చేశారు.