AP ACB: సీఐడీ మాజీ డీజీ సంజయ్‌పై ఏసీబీ కేసు నమోదు
ABN , Publish Date - Dec 24 , 2024 | 08:59 PM
Former CID DG Sanjay: సీఐడీ మాజీ డీజీ సంజయ్‌పై ఏసీబీ కేసు నమోదు చేసింది. నిధుల దుర్వినియోగం కేసులో ఆయనపై ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో పలు సెక్షన్ల కింద ఆయనపై ఏసీబీ కేసు నమోదు చేసింది.
అమరావతి, డిసెంబర్ 24: గత ప్రభుత్వ హయాంలో నిధుల దుర్వినియోగానికి పాల్పడిన వ్యవహారంలో సీఐడీ మాజీ డీజీ ఎన్. సంజయ్‌పై మంగళవారం ఏసీబీ కేసు నమోదు చేసింది. కొద్దిసేపటి క్రితం ఆయనపై ఏసీబీ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసింది. అవినీతి నిరోధక చట్టంలోని పలు సెక్షన్లు క్రింద సంజయ్‌పై కేసు నమోదు చేసింది. ఈ కేసులో ఏ1గా సంజయ్, ఏ2గా సౌత్రిక టెక్నాలజీ టెక్నాలజీస్, ఏ3గా క్రిత్య్వాప్ సంస్థను ఏసీబీ చేర్చింది. ఫైర్, సీఐడీ డీజీలుగా విధులు నిర్వహించిన సమయంలో సంజయ్ అవినీతికి పాల్పడినట్లు విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఇప్పటికే ప్రభుత్వానికి నివేదిక అందజేసింది. ఈ నివేదికను పరిశీలించిన అంతరం సంజయ్‌పై ప్రభుత్వం సస్పెన్షన్ వేటు వేసింది. అనంతరం నివేదికను ఏసీబీకి పంపింది. దీంతో ప్రాథమిక సాక్ష్యాధారాలు సైతం ఉండటంతో సంజయ్‌పై ఏసీబీ అధికారులు కేసు నమోదు చేశారు. మరోవైపు సంజయ్‌ను ప్రాసిక్యూట్ చేసేందుకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఇప్పటికే అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే.
ఇంతకీ ఏం జరిగిందంటే.. అగ్నిమాపక శాఖలో ఆన్‌లైన్‌లో ఎన్వోసీలు జారీ చేసేందుకు అగ్ని ఎన్వోసీ వెబ్ సైట్, మొబైల్ యాప్ అభివృద్ధి, నిర్వహణ కాంట్రాక్ట్‌ను సౌత్రికా టెక్నాలజీస్ అండ్ ఇన్ ఫ్రా సంస్థకు సంజయ్ అప్పగించారు. అయితే ఎలాంటి పనులు జరగలేదు. ఆ సంస్థకు రూ. 59.93 లక్షల బిల్లులు చెల్లించారు. ఇక సీఐడీ తరఫున ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ నిరోధక చట్టంపై దళితులు, గిరిజనులకు అవగాహన సదస్సుల నిర్వహణ కాంట్రాక్ట్‌ను క్రిత్వ్యాప్ టెక్నాలజీస్‌కు కేటాయించి.. రూ. 1.19 కోట్లు చెల్లించారు.
Also Read: ఆసుపత్రి నుంచి కౌషిక్ డిశ్చార్జ్
Also Read: న్యూఢిల్లీలో ఎన్డీయే నేతల బేటీ.. హాజరుకానున్న సీఎం చంద్రబాబు
సదస్సులు మొత్తం సీఐడీ అధికారులే నిర్వహించడం గమనార్హం. అయితే ఆ సంస్థ అసలు సదస్సులే నిర్వహించకపోయినా బిల్లు పేరట నగదు చెల్లింపులు జరిగాయి. ఈ వ్యవహారంపై విజిలెన్స అండ్ ఎన్ ఫోర్స్‌మెంట్ విచారణ జరిపింది. నిజాలు నిగ్గు తేల్చింది. అనంతరం నివేదికలను ప్రభుత్వానికి అందజేసింది. దీంతో సంజయ్‌పై ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది.
Also Read: రేవతి భర్తకు ఉద్యోగం.. దిల్ రాజ్ కీలక ప్రకటన
Also Read: బెలగావి వేదికగా సీడబ్ల్యూసీ సమావేశాలు
ఇక సౌత్రికా టెక్నాలజీస్ అండ్ ఇన్ ఫ్రా కంపెనీ, క్రిత్వ్యాప్ టెక్నాలజీస్ సంస్థలో జమ అయిన సొమ్ము ఎవరు విత్ డ్రా చేశారు. ఆ నగదు ఎవరి ఖాతాలోకి వెళ్లాయనే అంశంపై ఇప్పటికే ఏసీబీ విచారణ చేపట్టింది. అదీకాక ఈ రెండు కంపెనీలు ఒకే చిరునామాతో ఉన్నట్లు ఏసీబీ విచారణలో గుర్తించారు. అయితే క్రిత్వ్యాప్ టెక్నాలజీ డొల్ల కంపెనీ అని తేల్చేశారు. ఈ కంపెనీ సైతం ఎవరిది, దీనిని ఎవరు నిర్వహించారు. ఆ నగదు ఎక్కడి వెళ్లిందనే కోణంలో ఏసీబీ అధికారులు విచారణ చేపట్టి.. నిజాలను రాబట్టేందుకు చర్యలు చేపట్టారు.
Also Read: ఏపీ ప్రజలకు మరో గుడ్ న్యూస్
Also Read: ఎమ్మెల్యే మాధవీ రెడ్డి ఎఫెక్ట్.. ఇడుపులపాయకు జగన్
For AndhraPradesh News And Telugu News