Home » Agnipath Scheme
భారత సైన్యంలో కీలకమైన అగ్నివీర్ నియామకాలకు సంబంధించిన రెండో దశ ప్రక్రియ జూలై 23 నుంచి ప్రారంభంకానుందని రక్షణ శాఖ గువాహటి విభాగం పీఆర్‌వో ఓ ప్రకటనలో తెలిపారు.
మిత్రపక్షాల నుంచి వచ్చిన ఒత్తిళ్ల నేపథ్యంలో అగ్నిపథ్‌లోని లోపాలను సరిదిద్దడానికి కేంద్ర ప్రభుత్వం సుముఖత వ్యక్తం చేసింది. ఈ పథకాన్ని సమీక్షించడానికి, అగ్నివీర్‌లకు మరింత లాభం చేకూర్చే అంశాలపై చర్చించేందుకు పది మంత్రిత్వ శాఖల కార్యదర్శులతో ఒక కమిటీని ఏర్పాటు చేసినట్టు తెలిసింది. ఈ బృందం ఈ స్కీమ్‌ను మరింత ఆకర్షణీయంగా మార్చడానికి అవసరమైన సిఫారసులు చేయనుంది.
లోక్‌సభ ఎన్నికల అనంతరం ఎన్డీయే మిత్రపక్షాలైన జేడీయూ, ఎల్‌జేపీ (రామ్ విలాస్) అగ్నిపథ్ పథకాన్ని పునఃసమీక్షించాల్సిన అవసరం ఉందని సూచించాయి. తాజాగా భారత సైన్యం కూడా ఈ పథకాన్ని సమీక్షించి దాన్ని మెరుగుపర్చాలని సిఫారసు చేసింది. నాలుగేళ్ల సర్వీసు పూర్తయిన తర్వాత రెగ్యులర్ సర్వీసుల్లో చేరే అగ్నివీర్‌ల శాతాన్ని ప్రస్తుతం ఉన్న 25 నుంచి 60-70 శాతానికి పెంచాలనే సిఫారసు కూడా దీనిలో ఉంది.
కేంద్రంలో వరుసగా మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్న బీజేపీకి అగ్నిపథ్ అంశం తలనొప్పిగా మారేలా ఉంది. సొంతంగా మెజార్టీ దక్కకపోవడంతో టీడీపీ, బిహార్‌లోని జేడీయూ మద్దతుతో ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీ సిద్ధమైంది. ఇలాంటి కీలక తరుణంలో జేడీయూ తన తొలి డిమాండ్‌ను తెరపైకి తెచ్చింది.
హరియాణాలో అక్టోబరు-నవంబరులో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుత లోక్‌సభ ఎన్నికలను ఆ రాష్ట్రంలోని అన్ని పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి.
'అగ్నివీర్' స్కీమ్‌కు ఆర్మీ కూడా వ్యతిరేకమేనని, ఇందుకు సంబంధించిన నిర్ణయం ప్రధానమంత్రి కార్యాలయం లోనే జరిగిందని కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ అన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే 'అగ్నివీర్' పథకాన్ని రద్దు చేస్తామని మధ్యప్రదేశ్‌లోని షహడోల్‌లో సోమవారంనాడు జరిగిన ఎన్నికల ర్యాలీలో మాట్లాడుతూ రాహుల్ చెప్పారు.
అగ్నివీరులను అతి తక్కువ వయసులోనే బయటకు పంపించేస్తున్నారనే విమర్శలు వస్తున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం దిద్దుబాటు