Share News

Ministry of Defence: జూలై 23 నుంచి అగ్నివీర్‌ నియామక ప్రక్రియ

ABN , Publish Date - Jun 27 , 2024 | 04:36 AM

భారత సైన్యంలో కీలకమైన అగ్నివీర్‌ నియామకాలకు సంబంధించిన రెండో దశ ప్రక్రియ జూలై 23 నుంచి ప్రారంభంకానుందని రక్షణ శాఖ గువాహటి విభాగం పీఆర్‌వో ఓ ప్రకటనలో తెలిపారు.

Ministry of Defence:  జూలై 23 నుంచి అగ్నివీర్‌ నియామక ప్రక్రియ

న్యూఢిల్లీ, జూన్‌ 26: భారత సైన్యంలో కీలకమైన అగ్నివీర్‌ నియామకాలకు సంబంధించిన రెండో దశ ప్రక్రియ జూలై 23 నుంచి ప్రారంభంకానుందని రక్షణ శాఖ గువాహటి విభాగం పీఆర్‌వో ఓ ప్రకటనలో తెలిపారు. అగ్నివీర్‌ నియామకాలను రెండు దశల్లో చేపడుతున్నారు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు తొలిదశలో కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష నిర్వహిస్తారు.

ఈ పరీక్షలో ఉత్తీర్ణులైన వారికి రెండో దశలో భౌతిక సామర్థ్యం సహా ఇతర పరీక్షలు నిర్వహిస్తారు. ఈ ఏడాది ఏప్రిల్‌-మే మధ్య జాతీయ స్థాయిలో నిర్వహించిన తొలిదశలో అర్హులైన అభ్యర్థులకు వచ్చే నెల 23-27 మధ్య అసోంలోని మిలిటరీ స్టేషన్‌లో రెండోదశ నియామక ప్రక్రియ చేపట్టనున్నారు. తొలిదశలో అర్హులైన అభ్యర్థుల అడ్మిట్‌ కార్డులను ఇండియన్‌ ఆర్మీ అధికారిక వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవాలని పీఆర్‌వో సూచించారు. రెండో దశ ప్రక్రియ అత్యంత పారదర్శకంగా, నిష్పక్షపాతంగా జరుగుతుందని, దళారులను ఆశ్రయించి మోస పోవద్దని అభ్యర్థులను కోరారు.

Updated Date - Jun 27 , 2024 | 07:12 AM