Home » Agriculture
పంట రుణమాఫీ పథకం అమలు సమయంలో 30వేల రైతుల ఖాతాల్లో సమస్యలు గుర్తించామని టెస్కాబ్(తెలంగాణ స్టేట్ కో- అపరేటివ్ అపెక్స్ బ్యాంకు) ఎండీ డాక్టర్ బి.గోపి తెలిపారు.
రెండు లక్షల రూపాయలకు పైగా పంట రుణ బకాయిలున్న రైతులకు.. ఆ పైనున్న మొత్తాన్ని చెల్లించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్దిష్టమైన గడువు విధించాలనే యోచనలో ఉంది.
మండలంలోని పలు గ్రామాల్లో రైతులు వ్యవసాయ బోర్ల కింద వరిసాగుచేసేందుకు ఆసక్తిచూపుతున్నారు. ఆయా గ్రామాల్లోని వ్యవసాయ బోరుబావుకింద రైతు బీపీటీ, సోనామసూరీ తదితర రకాల పైర్లు వేశారు. పొలాలను దుక్కి దున్నడం, వరినాట్ల పనుల్లో నిమగ్నమయ్యారు. ఈ వారంలో వర్షాలు బాగా కురిస్తే తొలకరి వ రినాట్లు మరింత వేగం పుంజుకుంటాయని ఆశాభావం వ్యక్తంచేస్తున్నారు.
రాగిపంట సాగుచేస్తే ప్రభుత్వం విత్తనాలను అందివ్వడంతో పాటు పండిన పంటను గిట్టుబాటు ధరలు కల్పించి కోనుగోలు చేస్తుందని జిల్లా వ్యవసాయశాఖ డీడీఏ విద్యావతి తెలిపారు. ఆమె మంగళవారం మండలంలోని చిగిచెర్ల రైతుసేవా కేం ద్రంలో రాగిపంట సాగుపై రైతులకు అవగాహన కల్పించారు. ఈ సందర్బంగా డీడీఏ రైతులతో మాట్లాడుతూ.... త్వరలోనే రైతులకు రాగి విత్తనాలు పంపీణీ చేస్తామని, రైతులందరూ ప్రత్యామ్నాయ పంటగా రాగి సాగుచేయాలన్నారు.
నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోతల పథకాన్ని రెండు ప్యాకేజీలుగా విడగొట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ పథకానికి ఈనెల 9వ తేదీన టెండర్లు పిలవనున్నారు.
అర్హత కలిగిన రైతులందరికీ రూ.2 లక్షల్లోపు పంట రుణాలను మాఫీ చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టగా.. పథకం అమలుకు సాంకేతిక సమస్యలు ఇబ్బందికరంగా మారాయి. ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా అన్ని అర్హతలున్న రైతులకు కూడా రుణమాఫీ జాబితాలో చోటు దక్కడంలేదు.
గిరిజన రైతులకు ఇవ్వాల్సిన విత్తన సబ్సిడీలకు సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ(ఐటీడీఏ) మంగళం పాడేసింది. చివరిగా 2016లో రాయితీ విత్తనాలు అందుకున్న రైతులకు ఎనిమిదేళ్లుగా ఐటీడీఏల సాయం అందడం లేదు.
తక్కువ జలాలతో అధిక ఫలసాయం అందించే సాగు పద్ధతులే ప్రపంచానికి ఆహారభద్రతను సమకూర్చగలవని ప్రధాని మోదీ అన్నారు. దీనికోసం బ్లాక్ రైస్, తృణధాన్యాల సాగుపై దృష్టి సారించాల్సి ఉంటుందని ఆయన తెలిపారు.
తెలంగాణలో వరితో పాటు ఇతర పంటల విత్తనాల ఉత్పత్తిని పెంచాలని, అందుకు అధికారులు కొత్త ఆలోచనలు చేయాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచించారు.
రూ.2 లక్షలు, ఆపైన రుణాలున్న రైతులను రెండు విభాగాలుగా విభజించి రుణమాఫీ అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. రూ.లక్ష, లక్షన్నర రుణాలను రెండు విడతల్లో మాఫీ చేసిన సర్కారు..