Home » Allu Arjun
నంద్యాల పోలీసుల తీరుపై కేంద్ర ఎన్నికల సంఘం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. నంద్యాల ఎమ్మెల్యే, వైసీపీ అభ్యర్థి శిల్పా రవి చంద్రకిశోర్ రెడ్డి ఇంటికి హీరో అల్లు అర్జున్ నిన్న (శనివారం) వచ్చారు. ఆ సమయంలో వైసీపీ శ్రేణులు, అల్లు అర్జున్ను చూసేందుకు జనం ఎగబడ్డారు. ఈ ఘటనపై పోలీసులు అల్లు అర్జున్, శిల్ప రవిపై కేసు నమోదు చేశారు.
రేపే ఎన్నికల పండుగ. సామాన్యులతో పాటు సెలబ్రిటీలంతా ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఎవరెక్కడ వినియోగించుకోనున్నారంటే.. ఓబుల్‌రెడ్డి స్కూల్లో జూనియర్ ఎన్టీఆర్, ప్రణతి ఓటు హక్కును వినియోగించుకున్నారు. బీఎస్ఎన్ఎల్ సెంటర్ జూబ్లీహిల్స్‌లో అల్లు అర్జున్, స్నేహారెడ్డి, అల్లు అరవింద్, అల్లు శిరీష్ .. జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్లో మహేశ్‌బాబు, నమ్రత , మంచు మోహన్‌బాబు, విష్ణు, లక్ష్మి, మనోజ్, విజయ దేవరకొండ, ఆనంద్ దేవరకొండ, శ్రీకాంత్, జీవిత, రాజశేఖర్ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
ఏపీ అసెంబ్లీ ఎన్నికల వేళ నంద్యాల శాసనసభ వైసీపీ అభ్యర్థి శిల్పా రవిచంద్ర కిశోర్ రెడ్డి విజయాన్ని కాంక్షిస్తూ ఆయన ఇంటికి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ వెళ్లిన విషయం తెలిసిందే. ఆయన్ను చూసేందుకు అభిమానులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. అయితే ఎలాంటి ముందస్తు అనుమతి లేకుండా నంద్యాలలో అల్లు అర్జున్, శిల్పా రవి ర్యాలీ నిర్వహించారంటూ పోలీసులకు రిటర్నింగ్ అధికారి ఫిర్యాదు చేశారు
Andhrapradesh: ‘‘నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిశోర్ రెడ్డి ఇంటికి ఐకాన్ స్టార్, హీరో అల్లు అర్జున్ వస్తే.. ఎమ్మెల్యే అనుచరులు జనసేన జెండాలు పట్టుకుని తప్పుడు రాజకీయాలు చేస్తున్నారు. ఇది తగునా?. జనసేన అధినేత పవన్ కళ్యాణ్, ఆయన పార్టీ జెండాలు పట్టుకొని చీకటి రాజకీయాలు చేస్తున్నారు’’ అంటూ చంద్రబాబు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఏపీ అసెంబ్లీ ఎన్నికల (AP Election 2024) ప్రచారం మరికొన్ని గంటల్లో ముగియనున్న నేపథ్యంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) ట్విస్ట్ ఇచ్చారు. ఎవరూ ఊహించని విధంగా ఆయన ఎన్నికల ప్రచారంలో ప్రత్యక్షమయ్యారు. నంద్యాల శాసనసభ నియోజకవర్గ వైఎస్సార్సీపీ అభ్యర్థి శిల్పా రవిచంద్రకిశోర్ రెడ్డి విజయాన్ని కాంక్షించారు.
Telangana Parliament Elections 2024: తెలంగాణ కాంగ్రెస్ (Congress) అభ్యర్థులను హైకమాండ్ దాదాపు ఖరారు చేసింది. తొలి జాబితాలో మొత్తం 9 మంది అభ్యర్థులను ప్రకటించాలని అగ్రనేతలు భావించినప్పటికీ.. 7 స్థానాలపై ఏకాభిప్రాయం కుదిరింది. కాంగ్రెస్ పార్టీ వర్గాల నుంచి వస్తున్న విశ్వసనీయ సమాచారం మేరకు ఈ అభ్యర్థులు ఫిక్స్ అయినట్లేనని తెలుస్తోంది...
ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ పాకిస్థాన్‌పై సెంచరీతో చెలరేగాడు. వన్డే ప్రపంచకప్‌లో భాగంగా బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా, పాకిస్థాన్ తలపడ్డాయి.
టాలీవుడ్ హీరో అల్లు అర్జున్‌కు (Allu Arjun) మాజీ సీజేఐ ఎన్వీ రమణ (Former CJI NV Ramana) అభినందనలు తెలిపారు.
కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన 69వ జాతీయ చలనచిత్ర పురస్కారాలలో (69th National Film Awards) ఉత్తమ నటుడి (Best Actor)గా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Icon Star Allu Arjun) అవార్డు గెలుచుకున్న విషయం తెలిసిందే...
తెలుగు పరిశ్రమలో 58 ఏళ్ల తర్వాత తొలిసారి మన హీరో అల్లు అర్జున్‌కు జాతీయ స్థాయిలో నేషనల్ అవార్డు వచ్చిందని.. ఇది అందరూ గర్వించదగ్గ విషయమని టీడీపీ అధినేత చంద్రబాబు అభిప్రాయపడ్డారు. అటు ఆర్.ఆర్.ఆర్ మూవీకి ఆరు అవార్డులు వచ్చాయని పేర్కొన్నారు. ఇలాంటి వాళ్లను వైసీపీ ప్రభుత్వం అవమానపరిచిందని.. ఎన్నో ఇబ్బందులకు గురిచేసిందని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.