Home » Allu Arjun
అల్లుఅర్జున్ను పోలీసులు అరెస్టు చేశారనే వార్త తెలుసుకున్న ప్రముఖ సినీ నటుడు చిరంజీవి.. వెంటనే అల్లు కుటుంబానికి అండగా వెళ్లారు.
‘‘అల్లు అర్జున్ను అరెస్ట్ చేసినందుకు ఇంతలా ప్రశ్నిస్తున్నారు కదా? మరి ఒక మహిళ ప్రాణం పోయింది. దానిపై ఒక్క ప్రశ్న కూడా అడగడం లేదు. ఆ మహిళ కుటుంబం పరిస్థితి ఏమిటి?
సంధ్య థియేటర్ వద్ద జరిగిన ఘటనలో అల్లు అర్జున్ తప్పేమీ లేదని పుష్ఫ -2 సినిమా ప్రీమియర్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో భార్యను కోల్పోయిన భాస్కర్ స్పష్టం చేశారు.
ఒకప్పుడు రాష్ట్రాన్ని దోచుకున్న వారు స్వేచ్ఛగా ఉండగా, జాతీయ అవార్డు గ్రహీత అల్లు అర్జున్ను మాత్రం ప్రభుత్వం అరెస్టు చేసిందని కేంద్ర మంత్రి బండి సంజయ్ విమర్శించారు.
అల్లు అర్జున్ అరెస్టు ప్రభుత్వ బాధ్యతారాహిత్యానికి నిదర్శనమని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు.
అల్లు అర్జున్ అరెస్టును మాజీ మంత్రి హరీశ్‌రావు తీవ్రంగా ఖండించారు. సినిమా చూడడానికి వెళ్లి అక్కడ జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మరణించడం అత్యంత బాధాకరమని పేర్కొన్నారు.
అల్లు అర్జున్ అరెస్టును మాజీ మంత్రి కేటీఆర్ ఖండించారు. జాతీయ అవార్డు పొందిన నటుడిని అరెస్టు చేయడం పాలకుల అభద్రతాభావానికి పరాకాష్ట అని విమర్శిస్తూ ఎక్స్‌లో ఓ పోస్ట్ చేశారు.
పుష్ప 2 సినిమా ప్రీమియర్ షో తొక్కిసలాట ఘటనకు సంబంధించిన కేసులో అరెస్టు అయిన అల్లు అర్జున్ను 14 రోజుల పాటు రిమాండ్‌కు పంపాలని గురువారం నాంపల్లి కోర్టు ఆదేశించింది.
పుష్ప-2 ప్రీమియర్ షో సందర్భంగా సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో నిందితుడు, సినీ హీరో అల్లు అర్జున్‌కు తెలంగాణ హైకోర్టు నాలుగు వారాల మధ్యంతర బెయిల్ ప్రసాదించింది.
సినిమాలో ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తూ పోలీసులకు చిక్కకుండా సవాలు విసిరే పుష్పరాజ్.. నిజ జీవితంలో మాత్రం జైలుకు వెళ్లాల్సి వచ్చింది. వెండితెరపై ‘తగ్గేదేలే’ అంటూ మేనరిజం ప్రదర్శించిన నటుడు చట్టం ముందు తగ్గాల్సివచ్చింది.