Home » AP Endowments Minister
మరికొన్ని రోజుల్లో శ్రావణ మాసం మొదలై కనకదుర్గమ్మ మరిన్ని మహోజ్వల కార్యాలు జరిపించుకోనున్న ఈ సందర్భంలో మరిన్ని గ్రంథావిష్కరణలు, ఉచిత వితరణలకు, మహాలక్ష్మీ ప్రదంగా జరుపనున్నట్లు సమాచారం. ఈ శ్రీవైభవానికి సహకరించి ప్రోత్సహించిన దేవాదాయ శాఖామంత్రి ఆనం రామనారాయణరెడ్డికి, దేవాదాయ శాఖ కమీషనర్ సత్యనారాయణ, మహోపన్యాసకులు చాగంటి కోటేశ్వర రావుకు, ‘సౌభాగ్య’ లక్షప్రతులు సమర్పించి పవిత్ర సంచలనం సృష్టించిన నిస్వార్ధ సేవకులు బొల్లినేని కృష్ణయ్యకు, నాలుగు గ్రంధాల ఆవిష్కరణకు కారణమైన అద్భుతమైన రచయిత పురాణపండ శ్రీనివాస్‌కు, దేవస్థానంలో అన్ని విభాగాల ఉద్యోగులకు ఈఓ రామారావు మనసారా కృతజ్ఞతలు తెలిపారు.
ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ మరొక అపురూప గ్రంధం ‘శ్రీ లలిత విష్ణు సహస్రనామ స్తోత్రమ్’ అనబడే సుమారు మూడు వందలపేజీల గ్రంధాన్ని ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఆవిష్కరించారు. ఆనం జన్మదినోత్సవం సందర్భంగా బుధవారం విజయవాడ ఇంద్రకీలాద్రిపై శ్రీ కనకదుర్గమ్మను కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్న అనంతరం ఆలయ ప్రాంగణంలో ఈ గ్రంధాన్ని ఆవిష్కరించి తొలిప్రతిని దేవస్థానం డిప్యూటీ కలెక్టర్ మరియు కార్య నిర్వహణాధికారి కె.ఎస్. రామారావుకు అందజేశారు.