Share News

ఏ సంప్రదాయాన్నైనా ‘శ్రీనివాస్’ సౌందర్యంగా అందిస్తారు: దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి

ABN , Publish Date - Jul 10 , 2024 | 11:37 PM

ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ మరొక అపురూప గ్రంధం ‘శ్రీ లలిత విష్ణు సహస్రనామ స్తోత్రమ్’ అనబడే సుమారు మూడు వందలపేజీల గ్రంధాన్ని ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఆవిష్కరించారు. ఆనం జన్మదినోత్సవం సందర్భంగా బుధవారం విజయవాడ ఇంద్రకీలాద్రిపై శ్రీ కనకదుర్గమ్మను కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్న అనంతరం ఆలయ ప్రాంగణంలో ఈ గ్రంధాన్ని ఆవిష్కరించి తొలిప్రతిని దేవస్థానం డిప్యూటీ కలెక్టర్ మరియు కార్య నిర్వహణాధికారి కె.ఎస్. రామారావుకు అందజేశారు.

ఏ సంప్రదాయాన్నైనా ‘శ్రీనివాస్’ సౌందర్యంగా అందిస్తారు: దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి

విజయవాడ, జూలై 10: శాస్త్ర మర్యాదలతో, ఎన్నో ఉపయోగకరమైన అంశాలతో, భక్తులకు అవసరమైన ప్రామాణిక గ్రంధాలను రచించడంలో, సంకలనం చెయ్యడంలో ఋషుల పరంపరకు పెద్ద పీట వేస్తూ అగ్రస్థానంలో పవిత్రంగా దూసుకుపోతున్న ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ మరొక అపురూప గ్రంధం ‘శ్రీ లలిత విష్ణు సహస్రనామ స్తోత్రమ్’ అనబడే సుమారు మూడు వందలపేజీల గ్రంధాన్ని ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఆవిష్కరించారు.

Sri-Lalitha-Vishnu-Book-1.jpg

ఆనం రామనారాయణ రెడ్డి జన్మదినోత్సవం సందర్భంగా బుధవారం విజయవాడ ఇంద్రకీలాద్రిపై శ్రీ కనకదుర్గమ్మను కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్న అనంతరం ఆలయ ప్రాంగణంలో శ్రీలలిత విష్ణు సహస్రనామ స్తోత్ర దివ్య వైభవ గ్రంధాన్ని ఆవిష్కరించి తొలిప్రతిని దేవస్థానం డిప్యూటీ కలెక్టర్ మరియు కార్య నిర్వహణాధికారి కె.ఎస్. రామారావుకు అందజేశారు.

Sri-Lalitha-Vishnu-2.jpg

ఈ సందర్భంగా రామనారాయణరెడ్డి మాట్లాడుతూ.. షణ్మతాలైన శైవ, వైష్ణవ, శాక్తేయ సౌర, గాణాపత్య, స్కాందములలో ఏ సాంప్రదాయానికైనా విశిష్ట సౌందర్యవంతమైన పవిత్ర గ్రంథాల్ని వేదాది విద్యల బలాలతో అందించడం పురాణపండ శ్రీనివాస్‌కే చెల్లిందని పేర్కొంటూ శ్రీనివాస్ నిస్వార్ధ యజ్ఞ సేవ, ప్రతిభ తనకి రెండు దశాబ్దాలుగా తెలుసని అభినందించారు.

Devotees-1.jpg

శ్రీదుర్గామల్లేశ్వర స్వామి వార్ల దేవస్థాన డిప్యూటీ కలెక్టర్ మరియు కార్య నిర్వహణాధికారి కె.ఎస్. రామారావు మాట్లాడుతూ.. ఆధ్యాత్మిక చైతన్యానికీ, భక్తి ఉద్యమానికీ నిస్వార్ధంగా ‘జ్ఞానమహాయజ్ఞ కేంద్రం’ స్థాపించి భక్త పాఠకులకు నిత్యా పారాయణ యోగ్యమైన శాస్త్రోక్తమైన శ్రీ స్తుతులను అందిస్తూ... పరమాద్భుతమైన వ్యాఖ్యానాలతో శ్రీనివాస్ లక్షలమందిని ఆకర్షిండానికి శ్రీ కనకదుర్గమ్మ కారుణ్యమే కారణమని ప్రశంసించారు. అనంతరం.. కె.ఎస్.రామారావు పర్యవేక్షణలో అర్చకులకు, భక్త బృందాలకు ఆనం రామనారాయణ రెడ్డి పవిత్రహస్తాలతో ఈ దివ్యగ్రంధాన్ని పంపిణీ చేయడం విశేషం.

sambasiva-rao.jpg

ఆనం రామనారాయణ రెడ్డి ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తరువాయి రోజున పురాణపండ శ్రీనివాస్ అద్భుత రచనలు ‘జయ జయ శత్రుభయంకర’, ‘నమోనమామి’ అనే రెండింటిని నెల్లూరు శ్రీరంగనాధస్వామి వారి ఆలయంలో ఆవిష్కరణ అంశాన్ని, ఆ రెండు అమోఘ గ్రంధాలకు భారీ స్పందన వచ్చిన అంశాన్ని దుర్గమ్మ ఆలయ వేదపండితులు ఈ సందర్భంగా చర్చించుకోవడం కనిపించింది. ‘జయ జయ శత్రుభయంకర, నమోనమామి’ ఆవిష్కరణ కార్యక్రమంలో మరొక మంత్రి నారాయణ, నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర రెడ్డి పాల్గొన్నారు.

Puranapanda.jpg

మరొక వైపు తిరుమల నాద నీరాజనమండపంలో బుధవారం తిరుమల పండిత వ్యాఖ్యాతలను, భక్త బృందాల్ని శ్రీశైల దేవస్థానం ప్రత్యేక సలహాదారులు పురాణపండ శ్రీనివాస్ మూడురకాల అపురూప గ్రంధాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. తిరుమల పండితోత్తములు పురాణపండ అఖండమైన ధార్మిక గ్రంథ రచన, ప్రచురణ, వితరణలను మంగళమయంగా అభినందించారు.

Lalitha-Vishnu-KSR.jpg

శ్రీ కనకదుర్గమ్మ దేవస్థానంలో అమ్మవారిని బుధవారం దర్శించుకున్న సీనియర్ న్యూస్ ప్రెజంటర్ సాంబశివరావు‌కు దేవస్థానం పీఆర్వో హరీష్ ధార్మిక గ్రంథాల్ని బహూకరించడాన్ని సాంబశివరావు దుర్గమ్మ అనుగ్రహంగా భావించడం విశేషం.

Updated Date - Jul 10 , 2024 | 11:43 PM