Home » AP TET 2024
Andhrapradesh: ఏపీ టెట్ ఫలితాలు విడుదలయ్యాయి. సోమవారం ఉదయం మంత్రి నారా లోకేష్ ఫలితాలను విడుదల చేశారు. టెట్ ఫలితాల్లో 50.79 శాతం మంది అర్హత సాధించారు. మొత్తం 1,87,256 మంది అర్హత పొందారు.
ఆంధ్రప్రదేశ్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్(TET) దరఖాస్తు గడువుకు సంబంధించి సోషల్ మీడియాలో వచ్చే అసత్య ప్రచారాలు నమ్మెద్దంటూ ఏపీ పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ విజయరామరాజు వెల్లడించారు. దరఖాస్తు గడువును పెంచుతున్నట్లు వచ్చే ప్రచారాలపై అప్రమత్తంగా ఉండాలని ఆయన హెచ్చరించారు. ముందుగా ప్రకటించిన విధంగానే దరఖాస్తు గడువు తేదీ ఉంటుందని ఆయన చెప్పుకొచ్చారు.
టెట్ పరీక్ష కొత్త షెడ్యూల్ను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సోమవారం విడుదల చేసింది. అక్టోబర్ 3 నుంచి 20వ తేదీ వరకు టెట్ పరీక్షలు నిర్వహించనున్నట్టు ప్రభుత్వం వెల్లడించింది.