Share News

AP TET: టెట్ దరఖాస్తు గడువుపై ఏపీ సర్కార్ క్లారిటీ..

ABN , Publish Date - Jul 28 , 2024 | 06:08 PM

ఆంధ్రప్రదేశ్‌ టీచర్‌ ఎలిజిబిలిటీ టెస్ట్(TET) దరఖాస్తు గడువుకు సంబంధించి సోషల్ మీడియాలో వచ్చే అసత్య ప్రచారాలు నమ్మెద్దంటూ ఏపీ పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ విజయరామరాజు వెల్లడించారు. దరఖాస్తు గడువును పెంచుతున్నట్లు వచ్చే ప్రచారాలపై అప్రమత్తంగా ఉండాలని ఆయన హెచ్చరించారు. ముందుగా ప్రకటించిన విధంగానే దరఖాస్తు గడువు తేదీ ఉంటుందని ఆయన చెప్పుకొచ్చారు.

AP TET: టెట్ దరఖాస్తు గడువుపై ఏపీ సర్కార్ క్లారిటీ..

ఆంధ్రప్రదేశ్‌ టీచర్‌ ఎలిజిబిలిటీ టెస్ట్(TET) దరఖాస్తు గడువుకు సంబంధించి సోషల్ మీడియాలో వచ్చే అసత్య ప్రచారాలు నమ్మెద్దంటూ ఏపీ పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ విజయరామరాజు వెల్లడించారు. దరఖాస్తు గడువును పెంచుతున్నట్లు వచ్చే ప్రచారాలపై అప్రమత్తంగా ఉండాలని ఆయన హెచ్చరించారు. ముందుగా ప్రకటించిన విధంగానే దరఖాస్తు గడువు తేదీ ఉంటుందని ఆయన చెప్పుకొచ్చారు.


జులై 2వ తేదీన టెట్ నోటిఫికేషన్‌‌ను ఏపీ ప్రభుత్వం విడుదల చేసింది. దీనికి సంబంధించిన ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ జులై 4నుంచి ప్రారంభమైంది. ఆగస్టు 3తో దరఖాస్తు ప్రక్రియ గడువు ముగుస్తుంది. అయితే ఆన్‌లైన్‌ దరఖాస్తు గడువు పొడిగిస్తున్నట్లు ఫేక్ న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్‌గా మారాయి. ఫేక్ న్యూస్ వ్యవహారం రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి వెళ్లడంతో ఏపీ పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌ విజయరామరాజు దీనిపై స్పందించారు. అలాంటి అసత్య ప్రచారాలు నమ్మెద్దంటూ అభ్యర్థులకు హితవు పలికారు. టెట్‌ దరఖాస్తు గడువును పొడిగించడం లేదని క్లారిటీ ఇచ్చారు. అర్హులైన అభ్యర్థులు ఆగస్టు 3లోపు దరఖాస్తు చేసుకోవాలని ఆయన చెప్పారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు.


ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటివరకూ 3,20,333మంది అభ్యర్థులు టెట్ పరీక్ష కోసం దరఖాస్తు చేసుకున్నారని ఏపీ పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ విజయరామరాజు వెల్లడించారు. అక్టోబర్‌ 3నుంచి 20వ తేదీ వరకు ఆన్‌లైన్‌ విధానంలో పరీక్షలు నిర్వహిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. అలాగే రోజుకు రెండు విడతల్లో పరీక్షలు ఉంటాయని తెలిపారు. సెప్టెంబర్‌ 22నుంచి హాల్‌ టికెట్లు అందుబాటులోకి రానున్నాయని, అభ్యర్థులు వాటిని డౌన్ లోడ్ చేసుకోవాలని విజయరామరాజు సూచించారు. ఇప్పటివరకూ దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల కోసం ఎడిట్ ఆప్షన్ అందుబాటులోకి తెచ్చినట్లు ఆయన తెలిపారు. దరఖాస్తు సమయంలో తప్పులు నమోదు అయి ఉంటే వాటిని సరిచేసుకోవాలని ఆయన సూచించారు. అలాగే ఎలాంటి తప్పులు లేని హాల్ టికెట్‌తో పరీక్షకు హాజరు కావాలని అభ్యర్థులకు విజయరామరాజు సూచించారు.


పరీక్షలకు దాదాపు రెండు గడువు ఉన్న నేపథ్యంలో టెట్ మైనార్టీ అభ్యర్థులకు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్‌ వెల్లడించారు. దీని కోసం రాష్ట్రవ్యాప్తంగా 19శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు ఆయన వెల్లడించారు. మైనార్టీ అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మంత్రి ఫరూక్ కోరారు.

ఈ వార్తలు కూడా చదవండి:

Minister Ravi Kumar: లైన్‌మెన్ రామయ్య సాహనం ప్రశంసనీయం: మంత్రి గొట్టిపాటి

Road Accident: కాకినాడ జిల్లాలో దారుణం.. ముగ్గురు అన్నదమ్ములు మృతి..

Updated Date - Jul 28 , 2024 | 06:32 PM