AP Growth Rate: మరో రికార్డు సృష్టించిన చంద్రబాబు సర్కార్
ABN , Publish Date - Apr 06 , 2025 | 02:30 PM
AP Growth Rate: చంద్రబాబు సర్కార్ మరో రికార్డు సాధించింది. దేశంలోనే గ్రోత్ రేట్ రాష్ట్రాల్లో టాప్ లిస్ట్‌లో ఆంధ్రప్రదేశ్ స్థానం సంపాదించింది. గ్రోత్ రేట్ వృద్ది పెరగడం రాష్ట్ర ప్రజల సమష్టి విజయమని సీఎం చంద్రబాబు అభినందనలు తెలిపారు.

అమరావతి: దేశంలో గ్రోత్ రేట్ రాష్ట్రాల్లో టాప్ లిస్ట్‌లోకి ఆంధ్రప్రదేశ్ వచ్చింది. 2024-25 సంవత్సరానికి సంబంధించిన గ్రోత్ రేట్‌లో రెండో స్ధానంలో ఏపీ ఉంది. కాన్‌స్టెంట్ ప్రైసెస్‌లో 8.21శాతం గ్రోత్ రేట్‌తో దేశంలో రెండో స్థానంలో ఏపీ నిలిచింది. 9.69 శాతం గ్రోత్ రేట్‌తో దేశంలో మొదటి స్థానంలో తమిళనాడు ఉంది. ఏపీ గ్రోత్ రేట్‌ను నిర్థారిస్తూ సెంట్రల్ మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రాం ఇంప్లిమెంటేషన్ ఈ నివేదికలో ప్రస్తావించింది. వైసీపీ హయాంలో ఏపీలో కేవలం 6.19 శాతం గ్రోత్ రేట్ మాత్రమే ఉంది. ఏడాది కాలంలో 2.02 శాతం పెరిగి 8.21 శాతంగా నమోదైంది.
కరెంట్ ప్రైసెస్ విభాగంలో 12.02 శాతంగా ఏపీ గ్రోత్ రేట్ నమోదైంది. ఏపీ వృద్ధిరేటు దేశంలో రెండో స్థానానికి చేరడంపై ఆంధ్రప్రదేశ్ ఈజ్ రైజింగ్ అంటూ సీఎం చంద్రబాబు సోషల్ మీడియా మాధ్యమం ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. కూటమి ప్రభుత్వం తీసుకున్నచర్యలతో రాష్ట్రం గాడిన పడటంతో పాటు కాన్ఫిడెన్స్ పెంచేలా వృద్ధి రేటు సాధించామని సీఎం చంద్రబాబు వెల్లడించారు. వ్యవసాయం, పరిశ్రమలు, సేవలు, ఇంధన రంగం సహా పలు రంగాల్లో తీసుకువచ్చిన పాలసీలతో మెరుగైన ఫలితాలు వస్తున్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. గ్రోత్ రేట్ వృద్ధి పెరగడం రాష్ట్ర ప్రజల సమష్టి విజయం అంటూ సీఎం చంద్రబాబు అభినందనలు తెలిపారు. ఏపీ బంగారు భవిష్యత్ కోసం కలిసి ప్రయాణాన్ని కొనసాగిద్దామని రాష్ట్ర ప్రజలకు సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు.
ఈ వార్తలు కూడా చదవండి..
Sri Rama Navami: జగదభి రాముడు శ్రీరాముడు
For More AP News and Telugu News