Home » Arvind Kejriwal
ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ ఎంపీ స్వాతి మలివాల్‌పై దాడి వ్యవహారంపై ఆ పార్టీ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఎట్టకేలకు మౌనం వీడారు. దీనిపై నిష్పాక్షిక దర్యాప్తు జరిగి, న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నట్టు బుధవారంనాడు పీటీఐ వార్తాసంస్థకు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.
'ఆమ్ ఆద్మీ పార్టీ' చుట్టూ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) వల బిగుసుకుంటోంది. 2014-2022 మధ్య రూ.7.08 కోట్ల విదేశీ నిధులను 'ఆప్' అందుకుందంటూ హోం మంత్రిత్వ శాఖకు ఈడీ రిపోర్డ్ చేసింది.
ఆప్ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ వ్యక్తిగత సహాయకుడు బిభవ్ కుమార్ అరెస్ట్ వ్యవహారం పెను దుమారం రేపుతోంది. అరెస్ట్‌ను నిరసిస్తూ ఈ రోజు ఆప్ బీజేపీ కేంద్ర కార్యాలయానికి ముట్టడికి పిలుపునిచ్చింది. సీఎం కేజ్రీవాల్, ఆప్ ముఖ్యనేతలు బీజేపీ కార్యాలయానికి తరలి వచ్చారు. ఆప్ నేతల బీజేపీ ఆఫీసు ముట్టడి నేపథ్యంలో పోలీసు బలగాలను భారీగా మొహరించారు.
భారతదేశ ప్రజాస్వామ్యాన్ని అంతం చేయాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కోరుకుంటున్నారని, దేశాన్ని నియంతృత్వం దిశగా నడిపిస్తున్నారని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు. 'ఆప్'ను లేకుండా చేయాలని బీజేపీ కంకణం కట్టుకున్నందునే తమ నేతలనందరినీ జైలుకు పంపాలనుకుంటోందని అన్నారు.
ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ ఎంపీ స్వాతి మాలివాల్‌పై దాడి కేసులో ఢిల్లీ పోలీసులు చర్యలు తీసుకున్నారు. తనపై ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ వ్యక్తిగత సహాయకుడు బిభవ్ కుమార్ దాడి చేశారని స్వాతి మాలివాల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ ఎంపీ స్వాతి మాలివాల్‌పై దాడి ఘటన దేశవ్యాప్తంగా ప్రకంపనలు రేపుతోంది. బెయిల్ మీద బయటకు వచ్చిన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఇంటికెళ్లానని స్వాతి మాలివాల్ వివరించారు. ఆ సమయంలో కేజ్రీవాల్ వ్యక్తిగత సహాయకుడు బిభవ్ కుమార్ తనపై దాడి చేశారని సంచలన ఆరోపణలు చేశారు.
భారతీయ జనతా పార్టీ కేంద్రంలో మరోసారి అధికారంలోకి వస్తే ఏ ఒక్క నేతను వదిలిపెట్టదని ఆప్ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సంచలన ఆరోపణలు చేశారు. ఓకే దేశం, ఓకే నేత విధానంపై ప్రధాని మోదీ పనిచేస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తే బీజేపీకి ప్రజల ఆదరణ తగ్గిందని ఆయన వివరించారు.
ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసుకు సంబంధించి మనీ లాండరింగ్ వ్యవహారంలో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌తోపాటు ఆమ్ ఆద్మీ పార్టీకి వ్యతిరేకంగా ఈడీ శుక్రవారం ఛార్జీషీట్ దాఖలు చేసింది.
ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ స్వాతీమాలీవాల్(Swati Maliwal)పై దాడి జరిగిన నేపథ్యంలో.. సీఎం అరవింద్ కేజ్రీవాల్ సైలెంట్‌గా ఉండటం తనను ఆశ్చర్యానికి గురి చేస్తోందని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) పేర్కొన్నారు.
ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ సభ్యురాలు స్వాతి మలివాల్‌పై దాడి కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఢిల్లీ సీఎం పీఎ బిభవ్ కుమార్‌కు జాతీయ మహిళా కమిషన్ గురువారం సమన్లు జారీ చేసింది.