Home » Arvind Kejriwal
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు(delhi liquor policy scam)లో అరెస్టైన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్(arvind Kejriwal)కు ఈరోజు కీలకమని చెప్పవచ్చు. ఎందుకంటే కేజ్రీవాల్ అరెస్ట్, రిమాండ్‌ను సమర్థిస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టు(Supreme court)లో దాఖలైన పిటిషన్‌పై ఈరోజు మొదటిసారిగా విచారణ జరగనుంది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుందని రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.
లిక్కర్ స్కామ్‌లో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అరెస్టై జైలులో ఉన్న సంగతి తెలిసిందే. కేజ్రీవాల్‌ను జైలులో కలిసేందుకు ఆయన భార్య సునీత వచ్చారు. కేజ్రీవాల్‌ను కలిసేందుకు అధికారులు అనుమతి ఇవ్వలేదు. ఇదే అంశంపై ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు స్పందించారు. కేంద్ర ప్రభుత్వ తీరును ఎండగట్టారు.
లిక్కర్ స్కామ్‌లో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ కావడంతో రాజకీయ పరిణామాలు మారిపోతున్నాయి. ఢిల్లీలో తమ ప్రభుత్వాన్ని పడగొట్టాలని బీజేపీ చూస్తోందని మంత్రి ఆతిషి సంచలన ఆరోపణలు చేశారు. దీంతో బీజేపీ నేతలు, ఆప్ మంత్రులు మధ్య మాటల యుద్దం తీవ్రస్థాయికి చేరింది.
లిక్కర్ పాలసీకి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో తీహార్ జైలులో ఉన్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ చక్కటి ఆరోగ్యంతో ఉన్నట్టు జైలు వర్గాలు బుధవారంనాడు తెలిపాయి. ఆయన ఆరోగ్యం క్షీణిస్తోందన్న వార్తలను అధికారులు తోసిపుచ్చారు.
ఆమ్ ఆద్మీ పార్టీ నేత, అరవింద్ కేజ్రీవాల్ మంత్రివర్గంలో సాంఘిక సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్న రాజ్ కుమార్ ఆనంద్ తన మంత్రి పదవికి బుధవారంనాడు రాజీనామా చేశారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి సైతం ఆయన రాజీనామా సమర్పించారు. మార్చి 21వ తేదీన కేజ్రీవాల్ అరెస్టు తర్వాత మంత్రివర్గం నుంచి రాజీనామా చేసిన తొలి వ్యక్తి కూడా రాజ్‌కుమార్ ఆనంద్ కావడం విశేషం.
దేశ రాజధాని ఢిల్లీ సీఎం, ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ అరెస్టు అయిన తర్వాత ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పించాలని కోరుతూ పదే పదే పిటిషన్లు దాఖలు అవుతుండటంపై ఢిల్లీ హైకోర్టు బుధవారం అసంతృప్తి వ్యక్తం చేసింది.
మద్యం కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో అరెస్ట్ అయిన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు తాజాగా మరో ఎదురుదెబ్బ తగిలింది. తాను కోరిన ఓ విజ్ఞప్తిని ఢిల్లీలోని రూస్ అవెన్యూ కోర్టు బుధవారం కొట్టివేసింది.
తనకు ఢిల్లీ హైకోర్టులో నిరాశ ఎదురైన నేపథ్యంలో.. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తాజాగా అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టుని ఆశ్రయించారు. తనని ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ అక్రమంగా అరెస్ట్ చేసిందని, తనకు వెంటనే ఉపశమనం కల్పించాలని కోరారు.
లిక్కర్ స్కామ్ కేసులో అరవింద్ కేజ్రీవాల్ కు ఊరట దక్కలేదు. లిక్కర్ స్కామ్‌కు సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో తనను ఈడీ అరెస్టు చేయడాన్ని సవాలు చేస్తూ కేజ్రీవాల్ వేసిన పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు మంగళవారంనాడు కొట్టివేసింది. అరెస్టు తర్వాత ఈడీ రిమాండ్ చట్టవిరుద్ధం కాదని, ఢిల్లీ సీఎంను ఈడీ అరెస్టు చేయడం చట్టనిబంధనలకు విరుద్ధం కాదని కోర్టు స్పష్టం చేసింది.
దిల్లీ మద్యం కేసులో అరెస్టైన ఆప్ అధినేత, దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ( Kejriwal ) జైలు నుంచే పాలన సాగిస్తున్నారు. జైలులో ఉంటూ సమర్థవంతమైన పాలన అందించలేరంటూ తక్షణమే పదవి నుంచి రాజీనామా చేయాలని పలువురు డిమాండ్ చేశారు.