Home » Asaduddin Owaisi
హైదరాబాద్ ఎంపీ, మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఒవైసీతో అమెరికన్ కాన్సుల్ జనరల్ జెన్నిఫర్ లార్సన్ భేటీ అవడంపై నెట్టింట విమర్శల వర్షం కురుస్తోంది.
వక్ఫ్ చట్టం సవరణ బిల్లు పరిశీలనకు కేంద్రం ఏర్పాటు చేసిన సంయుక్త పార్లమెంటరీ కమిటీ (జేపీసీ)లో తెలుగు రాష్ట్రాలకు చెందిన నలుగురు ఎంపీలు ఉన్నారు.
వక్ఫ్ చట్టంలో పలు సవరణలకు కేంద్రం సమాయత్తమైంది. ప్రధానంగా.. కనిపించిన ప్రతి భూమీ, ఆస్తీ తమదేనంటూ నియంత్రణలోకి తీసుకుంటున్న వక్ఫ్ బోర్డుల అపరిమిత అధికారాన్ని కట్టడి చేయనుంది. మరింత పారదర్శకత కోసం సదరు భూములు/ఆస్తుల విషయంలో కూలంకష తనిఖీలను తప్పనిసరి చేయనుంది.
తనను హతమార్చుతామంటూ బెదిరింపు ఫోన్‌కాల్స్, మెసేజ్‌లు వస్తున్నాయని మజ్లిస్ పార్టీ అధ్యక్షుడు, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ తెలిపారు.
ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ నివాసంపై దాడికి సంబంధించి పోలీస్ స్టేషన్లో కేసు నమోదయ్యింది. ఈ దాడి ఘటనపై పార్లమెంట్ స్ట్రీట్‌లోని పోలీస్‌స్టేషన్‌లో వివిధ సెక్షన్ల కింద పోలీసులు శనివారం కేసు నమోదు చేశారు.
ఆల్ ఇండియా మజ్లిస్ ఏ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (AIMIM) చీఫ్, లోక్‌సభ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ(Asaduddin Owaisi) ఢిల్లీ ఇంటిపై(Delhi house) దాడి (attack) జరిగింది. కొందరు గుర్తుతెలియని దుండగులు ఆయన ఇంటి నేమ్ ప్లేట్, గేటుపై నల్ల ఇంకును(black ink) విసిరి ఆయన పేరు కనిపించకుండా చేశారు.
మజ్లిస్ చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ లోక్‌సభ సభ్యుడిగా కొనసాగడానికి అనర్హుడని, ఆయన్ను వెంటనే ఎంపీ పదవి నుంచి తొలగించాలని ప్రముఖ అడ్వొకేట్ హరిశంకర్ జైన్ రాష్ట్రపతిని కోరారు.
పార్లమెంటులో ఎంపీగా ప్రమాణస్వీకారం చేస్తూ చివర్లో 'జై పాలస్తీనా' అని నినదించడం విమర్శలకు దారితీయడంతో ఏఐఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ బుధవారంనాడు తొలిసారి స్పందించారు. పార్లమెంటులో తాను చేసిన వ్యాఖ్యలను ఆయన సమర్ధించుకుంటూ ''ఉత్తుత్తి బెదరింపులకు బెదిరేది లేదు'' అని వ్యాఖ్యానించారు.
తెలంగాణ ఎంపీలు లోక్‌సభలో నేడు (మంగళవారం) ప్రమాణస్వీకారం చేశారు. కాంగ్రెస్, బీజేపీ సభ్యులతో పాటు హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ కూడా ప్రమాణం చేశారు. ఆదిలాబాద్ ఎంపీ గోడెం నగేష్ హిందీలో ప్రమాణస్వీకారం చేశారు.
హైదరాబాద్ పార్లమెంట్ స్థానంపై పతంగి మరోసారి ఎగిరింది. వరుసగా నాలుగుసార్లు ప్రాతినిధ్యం వహిస్తూ వచ్చిన మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఒవైసీ(Asaduddin Owaisi).. ఔర్ ఏక్ బార్ అంటూ ఐదోసారి కూడా విజయఢంకా మోగించారు. మొత్తం 10,47,659 ఓట్లు పోలయ్యాయి.