Home » Atchannaidu Kinjarapu
Andhrapradesh: తెలుగులోనే ప్రభుత్వ ఉత్తర్వులు ఇవ్వాలన్న కూటమి ప్రభుత్వ నిర్ణయంపై రాష్ట్ర రెవెన్యూ, రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ శాఖా మంత్రి అనగాని సత్యప్రసాద్ హర్షం వ్యక్తం చేశారు. తెలుగు భాషాభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.
Andhrapradesh: వ్యవసాయంలో భూసార పరీక్షలు అవసరమని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. భూసార పరీక్షలకు కూడా ఆధునిక టెక్నాలజీ వచ్చిందని.. సేంద్రీయ వ్యవసాయ ద్వారా మంచి ఫలితాలు వస్తున్నాయని చెప్పారు. సేంద్రీయ వ్యవసాయం ప్రకృతి విపత్తులను తట్టుకుంటుందన్నారు. సేంద్రీయ పద్దతిలో పండించిన కూరగాయలకు మంచి డిమాండ్ ఉందని తెలిపారు.
Andhrapradesh: 2024లో కూటమి ప్రభుత్వం వచ్చేటప్పటికీ రాష్ట్రం వెంటిలీటర్పై ఉందని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. ఆరు మాసాల్లో కేంద్ర ప్రభుత్వం సహకరించడంతో రాష్ట్రనికి ఆక్సిజన్ అందిందన్నారు. వాలంటీర్ల కంటే రెండు గంటల ముందే పింఛన్లు ఇస్తున్నామని తెలిపారు. వైసీపీ ల్యాండ్ టైటలింగ్ యాక్ట్ తెచ్చి ప్రజలను మాయ చేద్దామని చూశారని..
నూతన సంవత్సర వేడుకల సందర్భంగా తనను కలిసేందుకు వచ్చే వారు బొకేలు, గజమాలలు, దుశ్శాలువాలు తీసుకురావద్దని మంత్రి అచ్చెన్నాయుడు కోరారు.
Andhrapradesh: ఐదు సంవత్సరాలు వైసీపీ పాలనలో తమపై అక్రమ కేసులు పెట్టారని.. అధికారం కోల్పోయినా వైసీపీ తీరు మారలేదని మంత్రి అచ్చెన్నాయుడు మండిపడ్డారు. పలాసలో సుపారీ గ్యాంగ్ ద్వారా నాగరాజును హత్య చేయాలని ఆలోచించటం దారుణమన్నారు.
Andhrapradesh: ‘‘అచ్చెన్నాయుడు కోపం నరం ఎప్పుడో తెగిపోయింది. నన్ను వైసీపీ హయాంలో జైలులో పెట్టి అనేక ఇబ్బందులు పెట్టారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రత్యర్థులపై కొరడా ఝులిపిస్తానని అందరూ భావించారు. కక్ష సాధింపు నా విధానం కాదు’’ మంత్రి అచ్చెన్న అన్నారు.
తన పాలనలో ప్రభుత్వ ఆస్తుల్ని తాకట్టు పెట్టిన నీచ చరిత్ర జగన్ రెడ్డిదేనని మంత్రి కొల్లు రవీంద్ర ఆరోపించారు. సీఎం చంద్రబాబు గురించి, విజన్ గురించి మాట్లాడే నైతిక అర్హత జగన్ రెడ్డికి లేదని మంత్రి కొల్లు రవీంద్ర హెచ్చరించారు.
వైసైీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి చేతకాని తనం వల్లే పదో తరగతిలో ఉత్తీర్ణతా శాతాలు ఘోరంగా పడిపోయాయని మంత్రి అనగాని సత్యప్రసాద్ విమర్శించారు. గాడితప్పిన విద్యా వ్యవస్థను యువ నేత నారా లోకేష్ అహర్నిషలు కష్టపడి దారిలో పెడుతుంటే చూసి సహించలేక పిచ్చి ప్రేలాపనలు పేలుతున్నారని మండిపడ్డారు.
AP Agriculture Budget 2024-25: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సోమవారం రాష్ట్ర బడ్జెట్ను అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. వార్షిక బడ్జెట్తో పాటు రూ. 43,402 కోట్లతో ప్రత్యేకంగా వ్యవసాయ బడ్జెట్ను కూడా ప్రవేశపెట్టింది సర్కార్.
స్వర్ణాంధ్ర-2047 లక్ష్యంతో వ్యవసాయ రంగానికి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పెద్దపీట వేస్తూ దూసుకెళ్తున్నారని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు.