Share News

AP Budget 2024-25: భారీగా ఏపీ వ్యవసాయ బడ్జెట్.. పూర్తి కేటాయింపులివే..

ABN , Publish Date - Nov 11 , 2024 | 12:45 PM

AP Agriculture Budget 2024-25: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సోమవారం రాష్ట్ర బడ్జెట్‌ను అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. వార్షిక బడ్జెట్‌తో పాటు రూ. 43,402 కోట్లతో ప్రత్యేకంగా వ్యవసాయ బడ్జెట్‌ను కూడా ప్రవేశపెట్టింది సర్కార్.

AP Budget 2024-25: భారీగా ఏపీ వ్యవసాయ బడ్జెట్.. పూర్తి కేటాయింపులివే..
AP Agriculture Budget 2024-25

AP Agriculture Budget 2024-25: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సోమవారం రాష్ట్ర బడ్జెట్‌ను అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. వార్షిక బడ్జెట్‌తో పాటు రూ. 43,402 కోట్లతో ప్రత్యేకంగా వ్యవసాయ బడ్జెట్‌ను కూడా ప్రవేశపెట్టింది సర్కార్. రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి అచ్చెన్నాయుడు అగ్రికల్చర్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ప్రసంగించిన అచ్చెన్నాయుడు.. ఆర్థిక వ్యవస్థకు వ్యవసాయరంగం వెన్నెముకగా పేర్కొన్నారు. రైతు అభ్యున్నతే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యంగా మంత్రి పేర్కొన్నారు. కౌలు రైతులకు గుర్తింపు కార్డులను పంపిణీ చేస్తామని ప్రకటించారు. వ్యవసాయ రంగాన్ని మరింత అభివృద్ధి చేస్తామని.. రైతులకు ఆధునిక పనిముట్లు, రాయితీపై విత్తనాలు సరఫరా చేస్తామని మంత్రి అచ్చెన్న తెలిపారు.


వడ్డీ లేని రునాలు, భూసార పరీక్షలకు ప్రాధాన్యమిస్తామని అచ్చెన్న చెప్పారు. రిమోట్ సెన్సింగ్ సాంకేతికతతో భూసార పరీక్షలు నిర్వహిస్తామన్నారు. అలాగే మట్టి నమూనాల కోసం ల్యాబ్‌లు ఏర్పాటు చేస్తామని అసెంబ్లీ వేదిక వ్యవసాయ మంత్రి ప్రకటించారు. సాగుకు సూక్ష్మ పోషకాలు అందిస్తామన్నారు. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి కోసం.. వ్యవసాయ రంగానికి నిర్ధిష్ట ప్రణాళిక అవసరం అన్నారు మంత్రి. పెట్టుబడి సాయం పెంచి నెల రోజుల్లోనే అందించామని చెప్పారు వ్యవసాయ, వ్యవసాయ అనుబంధ రంగాల అభివృద్ధే.. లక్ష్యంగా వ్యవసాయ బడ్జెట్‌ రూపొందించామని మంత్రి తెలిపారు. వ్యవసాయం ఆధారంగా 62% మంది జీవిస్తున్నారని.. 2047 టార్గెట్‌తో తమ ప్రభుత్వం ముందుకెళ్తోందని మంత్రి అచ్చెన్నాయుడు పేర్కొన్నారు.


వ్యవసాయ బడ్జెట్‌లో దేనికి ఎంత కేటాయించారంటే..

  • రూ.43,402 కోట్లతో ఏపీ వ్యవసాయ బడ్జెట్‌

  • రాయితీ విత్తనాలకు రూ.240 కోట్లు

  • భూసార పరీక్షలకు రూ.38.88 కోట్లు

  • విత్తనాల పంపిణీకి రూ.240 కోట్లు

  • ఎరువుల సరఫరాకు రూ.40 కోట్లు

  • పొలం పిలుస్తోంది రూ.11.31 కోట్లు

  • PACSల ద్వారా ఎరువుల పంపిణీ

  • డిజిటల్‌ వ్యవసాయం - రూ.44.77 కోట్లు

  • వ్యవసాయ యాంత్రీకరణ - 187.68 కోట్లు

  • వడ్డీ లేని రుణాలు - రూ.628 కోట్లు

  • అన్నదాత సుఖీభవ - రూ.4,500 కోట్లు

  • రైతు సేవా కేంద్రాలు - రూ.26.92 కోట్లు

  • ఇంటిగ్రేటెడ్‌ అగ్రి ల్యాబ్స్‌ - రూ.44.03 కోట్లు

  • పంటల బీమా - రూ.1,023 కోట్లు

  • వ్యవసాయ శాఖ - రూ.8,564.37 కోట్లు

  • ఉద్యానశాఖ - రూ.3,469.47 కోట్లు

  • పట్టు పరిశ్రమ - రూ.108.44 కోట్లు

  • వ్యవసాయ మార్కెటింగ్‌ - రూ.314.8 కోట్లు

  • సహకార శాఖ - రూ.308.26 కోట్లు

  • ప్రకృతి వ్యవసాయం - రూ.422.96 కోట్లు

  • ఎన్జీ రంగా యూనివర్సిటీ - రూ.507.3 కోట్లు

  • ఉద్యాన యూనివర్సిటీ - రూ.102.22 కోట్లు

  • వ్యవసాయ పశు విశ్వవిద్యాలయం - రూ.171.72 కోట్లు

  • ఫిషరీస్‌ యూనివర్సిటీ - రూ.38 కోట్లు

  • పశు సంవర్థక శాఖ - రూ.1,095.71 కోట్లు

  • మత్స్యరంగం అభివృద్ధి - రూ.521.34 కోట్లు

  • ఉచిత వ్యవసాయ విద్యుత్‌ - రూ.7,241.3 కోట్లు

  • ఉపాధి హామీ అనుసంధానం - రూ.5,150 కోట్లు

  • ఎన్టీఆర్‌ జలసిరి - రూ.50 కోట్లు

  • నీటిపారుదల ప్రాజెక్టుల నిర్వహణ - రూ.14,637.03 కోట్లు


Also Read:

అసెంబ్లీలో ఇంట్రస్టింగ్ సీన్.. అబాసుపాలైన వైసీపీ..

అలా అనడానికి సిగ్గు లేదా జగన్..

రోహిత్ రాకపోతే అతడే కెప్టెన్

For More Andhra Pradesh News and Telugu News..

Updated Date - Nov 11 , 2024 | 12:45 PM