Atchannaidu: నేను తలుచుకుంటే ఒక్కడూ మిగడు.. అచ్చెన్న మాస్ వార్నింగ్
ABN , Publish Date - Dec 21 , 2024 | 04:15 PM
Andhrapradesh: ‘‘అచ్చెన్నాయుడు కోపం నరం ఎప్పుడో తెగిపోయింది. నన్ను వైసీపీ హయాంలో జైలులో పెట్టి అనేక ఇబ్బందులు పెట్టారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రత్యర్థులపై కొరడా ఝులిపిస్తానని అందరూ భావించారు. కక్ష సాధింపు నా విధానం కాదు’’ మంత్రి అచ్చెన్న అన్నారు.
శ్రీకాకుళం, డిసెంబర్ 21: వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌కు మంత్రి అచ్చెన్నాయుడు (Minister Atchannaidu) పరోక్షంగా వార్నింగ్ ఇచ్చారు. శనివారం మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. ‘‘అచ్చెన్నాయుడు కోపం నరం ఎప్పుడో తెగిపోయింది. నన్ను వైసీపీ హయాంలో జైలులో పెట్టి అనేక ఇబ్బందులు పెట్టారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రత్యర్థులపై కొరడా ఝులిపిస్తానని అందరూ భావించారు. కక్ష సాధింపు నా విధానం కాదు. నేను కక్ష సాధింపులకు దిగుతున్నానని కొన్ని పిచ్చి కుక్కలు మొరుగుతున్నాయి. నేను తలచుకుంటే ఒక్కడు మిగలడు. తప్పు చేసిన వాడు తప్పించుకోలేడు. చట్టం తన పని తాను చేసుకుంటుంది’’ అని మంత్రి వెల్లడించారు.
నిద్రపట్టడం లేదు.. అశ్విన్ వైఫ్ ఎమోషనల్
అంతా మాయే..
గత ఐదు సంవత్సరాలు రైతులను మాయ చేశారని వైఎస్సార్సీపీపై విమర్శలు గుప్పించారు. సొంత పత్రికల్లో రైతు భరోసా కేంద్రాల ద్వారా మేలు చేస్తున్నట్టు ప్రకటనలు ఇచ్చుకునే మాయ చేశారన్నారు. జగన్ ఐదు సంవత్సరాల్లో రూ. 13 లక్షల కోట్లు అప్పు చేశారని తెలిపారు. ఆర్‌బీకేల ద్వారా ధాన్యం కొని రైతులకు ఆరు నెలల వరకు డబ్బులు వేసేవారు కాదన్నారు. 1600 కోట్లు రైతులకు జగన్ బాకాయిలు పెట్టారని విమర్శించారు మంత్రి. కూటమి ప్రభుత్వంలో నాలుగు గంటల్లోనే రైతు అకౌంట్‌లో డబ్బులు జమ అవుతున్నాయని తెలిపారు. తుఫాన్ కారణంగా నష్టపోయిన రైతులు ఆందోళన చెందవద్దని.. ప్రతి గింజను కొనుగోలు చేస్తామని స్పష్టం చేశారు.
డైరెక్టర్ రాంగోపాల్ వర్మకు ఏపీ సర్కార్ షాక్..
నాడూ నేడు పేరిట జగన్ కోట్లు దోచేశారని.. దానిపైన విచారణ వేస్తామని చెప్పారు. 117 జీవో తెచ్చి ప్రభుత్వ పాఠశాలలను ఎత్తేశారని విమర్శించారు. జనవరి 1 నుంచి ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనాన్ని అమలులోకి తీసుకొస్తామన్నారు. మూలపేట పోర్టు పనులు శరవేగంగా జరుగుతున్నాయన్నారు. పోర్టుకు అనుబంధంగా పరిశ్రమల అభివృద్ధి కోసం 10 వేల ఎకరాలు సమీకరిస్తున్నామని తెలిపారు. వచ్చే ఏడాది నాటికి మూలపేట పోర్టుకు మొదటి షిప్ తీసుకువస్తామని వెల్లడించారు. మూలపేట పోర్టు నుంచి భోగాపురం ఎయిర్ పోర్టుకు నాలుగు లైన్ల రహదారి నిర్మాణానికి చర్యలు ప్రారంభించామని మంత్రి అచ్చెన్నాయుడు పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి..
నిధుల మంజూరు, ఇతర పనులపై ఆరోపణలు
Read Latest AP News And Telugu News