Home » Ayodhya Sriram
అయోధ్యలో కొలువు తీరిన శ్రీరాముడిని భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బుధవారం దర్శించుకున్నారు. ఆ క్రమంలో శ్రీరాముడికి ఆమె ప్రత్యేక పూజలు చేశారు. అంతకుముందు ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో రాష్ట్రపతి ముర్మ అయోధ్య ఎయిర్ పోర్ట్‌కు చేరుకున్నారు.
అయోధ్య రామ్ లల్లా భక్తులకు ఆలయ ట్రస్ట్ కీలక అప్డేట్ చేసింది. శ్రీరామనవమి కారణంగా కొంతకాలంగా నిలిపివేసిన వీవీఐపీ సౌకర్యాన్ని పునరుద్ధరిస్తున్నట్లు వెల్లడించింది. ఈరోజు నుంచే ఈ సదుపాయం అందుబాటులోకి వస్తుందని తెలిపింది.
శ్రీరాముని జన్మదినోత్సవం రోజున ఆ బాలరామునికి జరిగిన సూర్య తిలకం వేడుక మీద సర్వత్రా చర్చ నెలకొంది. అయితే దీని వెనుక శాస్త్రీయ కారణాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. సూర్యతిలకం వేడుక వెనుక ఉన్న నిజమిదే..
శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని అయోధ్య ( Ayodhya ) బాల రాముని ఆలయంలోని మూల విరాట్ నుదుటిపై సూర్యకిరణాలు పడే విధంగా సూర్య తిలకం ఏర్పాటు చేశారు. సూర్యుని నుంచి వచ్చే కిరణాలను కటకాలు, దర్పణాల ద్వారా పరావర్తనం చెందించి రాముడి విగ్రహాన్ని తాకేలా రూపొందించారు.
అయోధ్య రామ్‌లల్లా(Ayodhya Ram Mandir) ప్రాణ ప్రతిష్ట తరువాత బుధవారం తొలి శ్రీ రామ నవమి(Sri Rama Navami) వేడుకలు ఆలయంలో కనులపండువగా జరిగాయి.
ఈ రోజు శ్రీరామనవమి సందర్భంగా అయోధ్యలోని రాంలాలా ఆలయంలో శ్రీరామునికి సూర్య తిలకం ఏర్పడింది. ఈ అరుదైన దృశ్యాన్ని ప్రధాని నరేంద్ర మోదీ(narendra modi) తాజాగా అసోం(assam)లోని నల్బరి(Nalbari) నుంచి రామ్ లల్లా సూర్య తిలకాన్ని ట్యాబ్ ద్వారా వీక్షించి దర్శించుకున్నారు.
అయోధ్య రామ్‌లల్లా(Ayodhya Ram Mandir) ప్రాణ ప్రతిష్ట తరువాత బుధవారం తొలి శ్రీ రామ నవమి(Sri Rama Navami) వేడుకలు ఆలయంలో కనులపండువగా జరుగుతున్నాయి. అయితే ప్రస్తుతం అందరి దృష్టి శ్రీ రాముడి నుదిటిపై పడే సూర్యుడి కిరణాలపై ఉంది.
శ్రీరామనవమి వేడుకలతో ఆధ్యాత్మిక శోభతో అయోధ్య ( Ayodhya ) పరవశిస్తోంది. రామ్ లల్లా సూర్య తిలకం కార్యక్రమానికి ముందు ఆలయ అర్చకులు బాల రాముడికి దివ్య అభిషేకం కార్యక్రమాన్ని నిర్వహించారు.
శ్రీరామనవమి సందర్భంగా దేశ ప్రజలకు ప్రధాని నరేంద్ర మోదీ ( PM Modi ) శుభాకాంక్షలు తెలిపారు. అయోధ్యలోని రామాలయంలో రాం లల్లా కొలువుదీరిన తరువాత ఇదే తొలి రామనవమి అని అన్నారు. ఐదు శతాబ్దాల నిరీక్షణ ఫలించి రామ మందిరంలో బాల రాముడిని పూజించే భాగ్యం లభించిందని ప్రధాని చెప్పారు.
శ్రీరామ..!!.. ఇది పేరు మాత్రమే కాదు. భక్తజనకోటి హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన వేదమంత్రం. ఆనాడు.. హనుమంతుడికి సీతమ్మ ఇచ్చిన ముత్యాలహారంలో తన రామయ్య జాడ లేదని తిరస్కరించిన ఆ పవనసుతుడే రామభక్తిలో మనందరికీ ఆదర్శం.