Ramoji Rao: రామోజీ రావు మృతి పట్ల కిషన్ రెడ్డి, బండారు దత్తాత్రేయ సంతాపం..
ABN , Publish Date - Jun 08 , 2024 | 10:57 AM
ఈనాడు గ్రూప్ సంస్థల ఛైర్మన్ రామోజీరావు(Ramoji Rao) ఇవాళ తెల్లవారుజామున ఆరోగ్య సమస్యలతో మృతిచెందారు. గుండె సంబంధిత సమస్యలతో హైదరాబాద్ నానక్‌రామ్ గూడలోని స్టార్ ఆస్పత్రిలో చికిత్సపొందుతూ మరణించారు. గుండెకు స్టెంట్ వేసి, ఐసీయూలో ఉంచినా ఫలితం లేకుండా పోయింది. ఆయన మృతిపట్ల భాజపా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి, హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ తీవ్ర సంతాపం తెలిపారు.
హైదరాబాద్: ఈనాడు గ్రూప్ సంస్థల ఛైర్మన్ రామోజీరావు(Ramoji Rao) ఇవాళ తెల్లవారుజామున ఆరోగ్య సమస్యలతో మృతిచెందారు. గుండె సంబంధిత సమస్యలతో హైదరాబాద్ నానక్‌రామ్ గూడలోని స్టార్ ఆస్పత్రిలో చికిత్సపొందుతూ మరణించారు. గుండెకు స్టెంట్ వేసి, ఐసీయూలో ఉంచినా ఫలితం లేకుండా పోయింది. ఆయన మృతిపట్ల భాజపా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి, హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ తీవ్ర సంతాపం తెలిపారు.
రామోజీరావు మృతి పట్ల హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ సంతాపం వ్యక్తం చేశారు. పాత్రికేయ రంగంలో రామోజీరావు చెరగని ముద్ర వేశారని దత్తాత్రేయ అన్నారు. పత్రికా స్వేచ్ఛను కాపాడటానికి విశేష కృషి చేశారని, ఆ రంగంలో నూతన ఒరవడి సృష్టించారని కొనియాడారు. తెలుగు భాషకు ఆయన చేసిన సేవలు మరువలేనివని, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. రామోజీ కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
రామోజీరావు మరణం తీవ్ర విషాదానికి గురిచేసిందని భాజపా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి అన్నారు. మీడియా రంగానికి రామోజీరావు చేసిన సేవలు అమూల్యమని కొనియాడారు. రామోజీరావు కుటుంబానికి ప్రగాఢ సానుభూతి ప్రకటించారు.