Home » Bathukamma
శరన్నవరాత్రి మహోత్సవాల్లో ఐదో రోజున విజయవాడ శ్రీ కనకదుర్గమ్మ మహాచండీదేవిగా దర్శనమిస్తారు.
బతుకమ్మ వేడుకల్లో ఆరో రోజైన ఆశ్వయుజ శుద్ధ పంచమి (సోమవారం) నాడు అలిగిన బతుకమ్మగా వ్యవహరిస్తారు.
ప్రపంచంలో పువ్వులను పూజించే సంస్కృతి ఒక్క తెలంగాణకు మాత్రమే ప్రత్యేకమని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. బతుకమ్మ పండుగ మన సంస్కృతికి ప్రతీక అని తెలిపారు.
బతుకమ్మ, దసరా పండుగలు జరుపుకోవడానికి ఊరికి వెళ్లే ప్రయాణికులతో బస్, రైల్వేస్టేషన్లు కిక్కిరిపోతున్నాయి. కొంత మంది సొంత వాహనాల్లో బయలుదేరడంతో జాతీయ రహదారులపై రద్దీ నెలకొంది.
Telangana: ఆశ్వయుజ శుద్ధ తదియనాడు నానే బియ్యం బతుకమ్మను జరుపుకుంటారు. రెండో రోజు రెండు వరుసలు, మూడో రోజు మూడు వరుసలతో బతుకమ్మను పేర్చిన మహిళలు నాలుగో రోజు అంటే నానే బియ్యం బతుకమ్మ రోజున నాలుగు వరుసలతో బతుకమ్మను త్రికోణంలో పేర్చుతారు.
Telangana: రెండో రోజున బతుకమ్మను రెండు వరుసలతో పేర్చిన మహిళలు.. మూడో రోజు మూడు వరుసల ఎత్తులో బతుకమ్మను సిద్ధం చేస్తారు. ఆశ్వయుజ శుద్ధ విదియ నాడు ముద్దపప్పు బతకమ్మను శిఖరం ఆకారంలో పేరుస్తారు.
Telangana: బతుకమ్మ తయారీలో తంగేడు, గునుగు పూలు చాలా ముఖ్యమైనవి.ఈ పూవులను తప్పని సరిగా ఉండేటట్లు చేసుకుంటారు మహిళలు. బతుకమ్మను పేర్చిన తరువాత గౌరమ్మను కూడా చేస్తారు. ఈరోజు బతుకమ్మ వేడుకల్లో పెద్దలకంటే పిల్లలే సందడిగా జరుపుకుంటారు.
ప్రకృతి స్వరూపిణిగా తెలంగాణ ప్రజలు ఆరాధించే బతుకమ్మ వేడుకల్లో రెండో రోజైన ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నాడు (గురువారం) ప్రకృతి స్వరూపిణి అయిన గౌరమ్మను ‘అటుకుల బతుకమ్మగా పిలుస్తారు.
పచ్చని చెట్లు.. రంగురంగుల పూలు.. కళకళలాడుతున్న చెరువులు, కుంటలతో నిండుతనం సంతరించుకున్న ప్రకృతిని దైవ స్వరూపంగా కొలిచేందుకు వేళైంది.
పూలనే దేవుళ్లుగా కొలిచే పండగ బతుకమ్మ. తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతీకగా బతుకమ్మ నిలుస్తోంది. ప్రతి ఏడాది భాద్రపద అమావాస్య మొదలు ఆశ్వియుజ శుక్ల అష్టమి వరకు తొమ్మిది రోజులు ఈ పండుగను జరుపుకుంటారు. బతుకమ్మ చరిత్ర తెలుసుకుందాం పదండీ..