Home » Bengaluru News
బెంగళూరు ఉత్తర తాలూకాలో అమానుష ఘటన చోటుచేసుకుంది. ఓ వ్యక్తి రుణం చెల్లించలేదని అతని మైనర్ కుమార్తెపై వడ్డీ వ్యాపారి అత్యాచారానికి ఒడిగట్టాడు.
‘మరోసారి నేను ముఖ్యమంత్రి’ అవుతా.. జేడీఎస్ మనుగడకు ఎవ్వరి మద్దతు అవస రం లేదు.. అని కేంద్ర భారీ పరిశ్రమలశాఖ మంత్రి కుమారస్వామి(Minister Kumaraswamy) ధీమా వ్యక్తం చేశారు.
బెంగళూరు చామరాజపేట ఫారిన్ పోస్టాఫీ్సకు వివిధ దేశాల నుంచి వచ్చిన 606 పార్సిల్స్లో రూ.21 కోట్ల విలువైన డ్రగ్స్ను పోలీసులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు.
ఆన్లైన్, సామాజిక మాధ్యమాల ద్వారా పరిచయం అయ్యే అపరిచిత వ్యక్తుల నుండి జాగ్రత్తగా ఉండాలని జిల్లా సైబర్ పోలీసులు ప్రజల్లో అవగాహన కల్పిస్తూ... ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నా... ప్రజలు మాత్రం అవేమి పట్టించుకోకుండా... డబ్బు ఆశతో లక్షలాది రూపాయలు పోగొట్టుకుంటున్న ఘటనలు... నిత్యం వెలుగు చూస్తున్నాయి.
బీజేపీపై అసత్య ఆరోపణలు చేయడం సరికాదని హీరోయిజం చూపించవద్దని ఎమ్మెల్యే గాలి జనార్దన్ రెడ్డి(MLA Gali Janardhan Reddy) మాజీ మంత్రి నాగేంద్రకు సూచించారు. నగరంలోని బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
తుఫాను ప్రభావం రాష్ట్రాన్ని కుదిపేస్తోంది. తీరప్రాంత జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తుండగా బెంగళూరు(Bengaluru) శివారు జిల్లాల్లో ఎడతెరిపి లేకుండా వాన కురుస్తోంది. ప్రత్యేకించి నగరంలో రెండోరోజు బుధవారం లక్షలాదిమందిని ఇబ్బంది కలిగించినట్టయ్యింది.
బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావంతో రాష్ట్రాన్ని మంగళవారం వర్షం కుదిపేసింది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోనూ వాన హోరెత్తించింది. తీరప్రాంత జిల్లాలు దక్షిణకన్నడ, ఉత్తరకన్నడ, ఉడుపి పరిధిలో వర్షంతోపాటు ఈదురుగాలులు ఇబ్బంది పెట్టాయి.
చిత్రదుర్గ రేణుకాస్వామి(Chitradurga Renukaswamy) హత్యకేసులో జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న నటుడు దర్శన్(Actor Darshan), ఏ1 నిందితు రాలు పవిత్రగౌడల బెయిల్ పిటిషన్ను కోర్టు కొట్టివేసింది. సోమవారం 57వ సీసీహెచ్ కోర్టు తీర్పును ప్రకటించింది. హత్య కేసులో జూన్ 11న దర్శన్ను అరెస్టు చేశారు.
హిందూమతంలో కులాల పిచ్చి కొనసాగుతోందని, ఎటువంటి మార్పులు రావడం లేదని బౌద్ద మతాన్ని స్వీకరిస్తున్నట్లు రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి మహదేవప్ప(Minister Mahadevappa) ప్రకటించారు.
హుబ్బళ్ళి వివాదానికి సంబంధించి కేసుల వాపసుపై బీజేపీ ఆందోళనను హోం మంత్రి పరమేశ్వర్(Home Minister Parameshwar) తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ వారికి పచ్చకామెర్లని అందుకే ప్రతి విషయాన్ని రాజకీయం చేస్తారన్నారు.