Actor Darshan: ఏప్రిల్ 2వ విచారణకు హాజరుకావాలి..
ABN , Publish Date - Feb 26 , 2025 | 01:54 PM
చిత్రదుర్గ రేణుకాస్వామి(Chitradurga Renuka Swamy) హత్యకేసులో నటుడు దర్శన్(Actor Darshan)తోపాటు నిందితులు అందరూ కోర్టు ముందు హాజరయ్యారు. మంగళవారం విచారణకు తప్పనిసరిగా హాజరు కావాల్సి ఉండడంతో అందరూ వచ్చారు.

బెంగళూరు: చిత్రదుర్గ రేణుకాస్వామి(Chitradurga Renuka Swamy) హత్యకేసులో నటుడు దర్శన్(Actor Darshan)తోపాటు నిందితులు అందరూ కోర్టు ముందు హాజరయ్యారు. మంగళవారం విచారణకు తప్పనిసరిగా హాజరు కావాల్సి ఉండడంతో అందరూ వచ్చారు. నిబంధనల బెయిల్‌పై విడుదలైన వారు కోర్టు విచారణకు తప్పనిసరిగా హాజరు కావాలనే షరతులు ఉన్నాయి.
ఈ వార్తను కూడా చదవండి: MP: ఆ వ్యవహారంలో ఎలాంటి విచారణకైనా సిద్ధమే..
ఈమేరకు బెంగళూరు(Bangalore)లోని 57వ సెషన్స్ కోర్టుకు వచ్చినవారి హాజరును సిబ్బంది సేకరించారు. ఏ1 నటి పవిత్రాగౌడ, ఏ2 దర్శన్‌లు ఎదురెదురుగా కోర్టులో తారసపడినా దర్శన్ పలకరించలేదు. విచారణ అనంతరం దర్శన్ నేరుగా రాజరాజేశ్వరినగర్(Rajarajeshwari Nagar)లోని ఇంటికి వెనుతిరిగారు. విచారణలు ఏప్రిల్ 2వ తేదీకి వాయిదాపడ్డాయి.
ఈవార్తను కూడా చదవండి: CVI: ఊబకాయానికి టీకాతో చెక్?
ఈవార్తను కూడా చదవండి: రేవంత్ ప్రతీ నిర్ణయం బూమరాంగే
ఈవార్తను కూడా చదవండి: ఖమ్మం జిల్లాలో చిరుతపులి సంచారం కలకలం..
ఈవార్తను కూడా చదవండి: మంత్రి పొంగులేటికి తప్పిన పెను ప్రమాదం.. అసలేం జరిగిందంటే..
Read Latest Telangana News and National News