Home » Bengaluru
బీజేపీ పాలనలో అక్రమాలపై విచారణలు వివిధ దశల్లో ఉన్నాయని ఐటీబీటీ శాఖ మంత్రి ప్రియాంక ఖర్గే(Minister Priyanka Kharge) కొత్తబాంబు పేల్చారు. బెంగళూరులో శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ మధ్యంతర నివేదికలపై పరిశీలన జరుపుతున్నామని అన్నారు. వీటి ఆధారంగా చర్యలు తీసుకుంటామన్నారు.
బెంగళూరులోని కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయానికి(Kempegowda International Airport) ఏడు ప్రతిష్టాత్మక అవార్డులు దక్కాయి. కాలిఫోర్నియాలో జరిగిన ప్రతిష్టాత్మక ఎయిర్పోర్ట్, ఫుడ్, బెవరేజ్తోపాటు హాస్పిటాలిటీ కాన్ఫరెన్స్ తదితర విభాగాల్లో పురస్కారాలు దక్కాయి.
సమాజంలో పత్రికలదే విశ్వసనీయత అని ‘ఆంధ్రజ్యోతి’ ఎడిటర్ కె.శ్రీనివాస్ అన్నారు. బుక్ బ్రహ్మ సాహిత్య ఉత్సవ్లో భాగంగా రెండోరోజు శనివారం ఐదు వేదికల ద్వారా బెంగళూరు కోరమంగళలోని సెయింట్ జాన్స్ ఆడిటోరియంలో ...
భిన్నత్వంలో ఏకత్వంలా ప్రతి భాషకు తనదైన గుర్తింపు ఉందని, దక్షిణాది భాషలను ఏకతాటిపైకి రావాల్సిన అవసరం వచ్చిందని ప్రముఖ సాహితీవేత్తలు అభిప్రాయపడ్డారు.
మైసూరు నగరాభివృద్ధ్ది ప్రాధికార(ముడా) ఇంటి స్థలాల కేటాయింపు అవినీతి వ్యవహారంలో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్యకు గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్ నోటీసులు జారీ చేయడంపై మంత్రి వర్గం తీవ్ర అభ్యంతరం తెలిపింది.
లోక్సభ ఎన్నికల్లో మహారాష్ట్ర నుంచి బీజేపీతో పొత్తు పెట్టుకుని పోటీ చేసిన జేడీసీ తాజాగా అడ్డం తిరిగింది. కర్ణాటక బీజేపీ తలపెట్టిన పాదయాత్రకు తమ నుంచి ఎలాంటి సపోర్ట్ ఉండదని జేడీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి హెచ్డీ కుమారస్వామి తెలిపారు.
దేశాన్ని పట్టి పీడుస్తున్న సమస్యలు ఎన్నో ఉన్నాయి. అయితే దేశ ప్రజలను మాత్రం పట్టి పీడిస్తున్న సమస్యల్లో ఒకటి. ట్రాఫిక్ సమస్య. ఈ సమస్య వల్ల ఇబ్బంది పడని వారు ఒక్కరంటే ఒక్కరు కూడా ఉండరంటే అతిశయోక్తి కాదేమో. రోజురోజుకు జనాభా పెరగుతుంది. అందుకు సరిపడా రహదారులు, మౌలిక సదుపాయాలు మాత్రం పెరగడం లేదు. ఈ విషయంలో ప్రజా ప్రభుత్వాలు సైతం చేతులెత్తేస్తున్నాయి.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి, ఆయన సతీమణి భారతి బెంగళూరు పర్యటన ముగించుకుని మంగళవారం నాడు ఏపీకి వచ్చారు. కాసేపటి క్రితమే గన్నవరం ఎయిర్పోర్టుకు చేరుకున్నారు.
మెట్రోపాలిటన్ నగరాల్లో ఆకతాయిల అల్లరి ఎక్కువ అవుతోంది. రోడ్డు మీద వెళ్లే సమయంలో కూడా వదలడం లేదు. ఆయా చోట్ల సీసీ కెమెరాలు ఉన్న లెక్క చేయడం లేదు. కారులో వెళ్లేవారిపై ఆకతాయిలు అనుచితంగా ప్రవర్తించారు. కారు డోర్ ముందు కాలితో తన్ని, సైగలతో హేళన చేశారు. వారి చేష్టలు అన్ని రికార్డయ్యాయి.
బెయిల్ పిటిషన్ల విచారణ సందర్భంగా న్యాయమూర్తులకు కామన్ సెన్స్ అవసరమని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ అన్నారు.