Viral News: వావ్.. వంట మనిషి కోసం రెజ్యూమ్.. వెల్లువలా వస్తున్న జాబ్ ఆఫర్లు..
ABN , Publish Date - Dec 02 , 2024 | 11:46 AM
ప్రైవేట్ రంగంలో పనిచేసే నిపుణులందరికీ రెజ్యూమ్ అవసరం. అయితే వంట మనిషి కోసం కూడా రెజ్యూమ్ చేస్తారని మీకు తెలుసా? బెంగళూరు వ్యక్తి తన వంట మనిషి కోసం రెజ్యూమ్ తయారు చేశాడు. ఆ రెజ్యూమ్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఆమెకు జాబ్ ఆఫర్లు వెల్లువెత్తుతున్నాయి.
మీరు ఏదైనా ఉద్యోగం కోసం వెళితే అక్కడ మీ బయోడేటా (CV) లేదా రెజ్యూమ్ (Resume) గురించి అడుగుతారు. దానిని చూసి మీరు ఆ ఉద్యోగానికి (Job) సరిపోతారో లేదో నిర్ణయించుకుంటారు. ప్రైవేట్ రంగంలో పనిచేసే నిపుణులందరికీ రెజ్యూమ్ అవసరం. అయితే వంట మనిషి (Maid) కోసం కూడా రెజ్యూమ్ చేస్తారని మీకు తెలుసా? బెంగళూరు (Bengaluru) వ్యక్తి తన వంట మనిషి కోసం రెజ్యూమ్ తయారు చేశాడు. ఆ రెజ్యూమ్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఆమెకు జాబ్ ఆఫర్లు వెల్లువెత్తుతున్నాయి (CV for a maid).
@varunperuu అనే ట్విటర్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది. వరుణ్ అనే వ్యక్తి తన వంట మనిషి ఉర్వి కోసం రెజ్యూమ్ రూపొందించాడు. వేరే వ్యక్తి వంట మనిషి గురించి ఎంక్వైరీ చేసినపుడు వరుణ్ ఈ రెజ్యూమ్‌ను ఫార్వార్డ్ చేశాడు. ``మీరు ఖచ్చితంగా రీతూ దీదీని మాస్టర్ చెఫ్‌ను పరిగణించాలి. ఆమె తన పనిని అద్భుతంగా చేస్తుంది. ఆమె తయారు చేసే హోమ్లీ ఫుడ్ ఉత్తమమైనది. నేను ఆమెకు ఒక రెజ్యూమ్‌ను తయారు చేశారు. ఎందుకంటే ఆమె దానికి అర్హమైనది`` అని వరుణ్ పేర్కొన్నారు. ఉర్వి యొక్క సామర్థ్యాలు, ఆమె వంట చేసే విధానం, ఆమె ఏయే వంటలు చేయడంలో నిష్ణాతురాలు వంటి విషయాలను పాయింట్ టు పాయింట్ పేర్కొన్నాడు.
అంతేకాదు, ఉర్వి నేపాలీ, హిందీ, కొద్దిగా ఇంగ్లీష్ కూడా మాట్లాడగలదని రెజ్యూమ్‌లో పేర్కొన్నాడు. వరుణ్ తయారు చేసిన ఆ రెజ్యూమ్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వరుణ్ చేసిన ఆ పోస్ట్‌ను దాదాపు 1.2 లక్షల మంది వీక్షించారు. వెయ్యి మందికి పైగా ఆ రెజ్యూమ్‌ను లైక్ చేశారు. ఆ రెజ్యూమ్‌ను చూసి చాలా మంది ఉర్వికి ఫోన్ చేసి జాబ్ ఆఫర్లు ఇస్తున్నారు. వంట మనిషికి అంత అద్భుతంగా రెజ్యూమ్ క్రియేట్ చేసిన వరుణ్ క్రియేటివిటీని మరికొందరు మెచ్చుకుంటున్నారు.
ఇవి కూడా చదవండి..
Viral Video: ఉక్కు శరీరం అంటే ఇదేనేమో.. అతడి దెబ్బకు స్టీల్ రాడ్ ఎలా వంగిపోయిందో చూడండి..
Viral Video: యూపీ నుంచి బీహార్‌కు.. లారీ బానెట్ తెరిచి చూసిన కార్మికులకు దిమ్మదిరిగే షాక్..
Viral Video: ఈమెను పెళ్లి చేసుకుంటే అప్పులన్నీ మాయం.. పెళ్లిలో వధువుకు వచ్చిన నగదు బహుమతులు చూస్తే..
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి