Share News

HMPV In India: భారత్‌లో కొత్త వైరస్ తొలి కేసు.. తెలుగు రాష్ట్రాలకు సమీపంలోనే

ABN , Publish Date - Jan 06 , 2025 | 11:18 AM

HMPV In India: చైనాలో శరవేగంగా వ్యాపిస్తున్న హెచ్‌ఎంపీవీ ఇండియాకూ చేరిందని తెలుస్తోంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా ప్రజల్లో ఈ వైరస్ గురించి భయాందోళనలు మొదలయ్యాయి. ఈ తరుణంలో ఓ 8 నెలల చిన్నారికి వైరస్ సోకడం మరింత ఆందోళన కలిగిస్తోంది.

HMPV In India: భారత్‌లో కొత్త వైరస్ తొలి కేసు.. తెలుగు రాష్ట్రాలకు సమీపంలోనే
HMPV In India

చైనాలో శరవేగంగా వ్యాపిస్తున్న హెచ్‌ఎంపీవీ ఇండియాకూ చేరిందని తెలుస్తోంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా ప్రజల్లో ఈ వైరస్ గురించి భయాందోళనలు మొదలయ్యాయి. ఈ తరుణంలో ఓ 8 నెలల చిన్నారికి వైరస్ సోకడం మరింత ఆందోళన కలిగిస్తోంది. కర్ణాటక రాజధాని బెంగళూరులో ఒక చిన్నారి అస్వస్థతకు గురవగా.. పేరెంట్స్ ఓ ప్రైవేట్ హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. అక్కడి ల్యాబ్స్‌లో టెస్ట్ చేయగా బేబీకి హ్యూమన్ మెటాన్యుమో వైరస్ (హెచ్‌ఎంపీవీ) పాజిటివ్ అని తేలింది. అదే ఆస్పత్రిలో తాజాగా మరో ఇలాంటి కేసును కనుగొన్నారు. ఇంకో 3 నెలల పాప ఈ వైరస్ బారిన పడింది. దీని మీద సమాచారం అందినట్లు కర్ణాటక ప్రభుత్వం తెలిపింది. అయితే తమ ల్యాబుల్లో దీన్ని నిర్ధారించాల్సి ఉందని పేర్కొంది. కాగా, వైరస్ సోకిన ఇద్దరు చిన్నారులతో పాటు వాళ్ల కుటుంబ సభ్యులు ఎవరూ కూడా గత కొన్ని రోజుల్లో విదేశాలకు ప్రయాణించకపోవడం గమనార్హం.

Updated Date - Jan 06 , 2025 | 12:45 PM