Home » Bhadrachalam
గోదావరి వరదలతో భద్రాద్రివాసులకు ముంపు బెడద లేకుండా ఇకపై కరకట్ట పూర్తిస్థాయి రక్షణ గోడగా నిలవనుంది. భద్రాచలం(Bhadrachalam) సుభాష్ నగర్ కాలనీ వద్ద నుంచి చేపట్టాల్సిన మిగులు కరకట్ట నిర్మాణ పనులకు కాంగ్రెస్ ప్రభుత్వంలో మోక్షం లభించింది.
భద్రాద్రి కొత్తగూడెం: భద్రాచలం శ్రీ సీతారామ చంద్ర స్వామి వారి దేవస్థానంలో రెండవ రోజు బుధవారం వసంత పక్ష ప్రయుక్త శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు కొనసాగుతున్నాయి. ఈ ఉత్సవాలలో భాగంగా ఈ రోజు మండల లేఖ, కుండ, కలశ, యాగశాల అలంకరణ జరగనుంది. సాయంత్రం సార్వభౌమ వాహన సేవ జరుగుతుంది.
ఎన్నో ఉద్విగ్నవేళల్ని, ఆపదలను తరిమి... అద్భుతాలను ప్రసాదించే ఈ శ్రీరామరక్షాస్తోత్రాన్ని ఈ శ్రీరామ నవమి కానుకగా వారాహి చలన చిత్రం అధినేత, శివవారాహీ ట్రస్ట్ చైర్మన్ , శ్రీ అమృతేశ్వరస్వామి దేవాలయం సంస్థాపకుడు సాయి కొర్రపాటి భద్రాచలం శ్రీరామనవమి వేడుకకు విచ్చేసే వేలాది భక్తులకు ఉచితంగా అందజేసే సదుద్దేశంతో సుమారు యాభైవేల ప్రతులను భద్రాచల శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానంకి అందజేయనున్నారు.
Telangana: భద్రాచలం శ్రీ సీతారామ చంద్ర స్వామి వారి దేవస్థానంలో సీతారాముల కళ్యాణ పనులు ప్రారంభమయ్యాయి. ఆ నీలిమేఘశ్యాముడు ఈరోజు (సోమవారం) పెళ్లి కొడుకు అవనున్నాడు. కళ్యాణ పనుల్లో భాగంగా ఆలయ ప్రాంగణంలో డోలోత్సవం, అనంతరం వసంతోత్సవం నిర్వహించనున్నారు. ముత్తైదువులు ఈరోజు పసుపు కొట్టి పనులు ప్రారంభించి కళ్యాణ తలంబ్రాలు కలుపనున్నారు. ఏప్రిల్ 17న శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం జరుగనుంది.
శ్రీరామనవమి పర్వదినం సమీపిస్తున్న తరుణంలో ఉత్సవాలకు భద్రాద్రి ( Bhadrachalam ) రామయ్య సిద్ధమవుతున్నాడు. నేడు సీతారాముల కళ్యాణ పనులకు అంకురార్పణ జరగనుంది.
Bhadradri: భద్రాద్రి రామాలయం(Bhadrachalam Temple) అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. స్థానిక భక్తులను(Devotees) దృష్టిలో ఉంచుకుని ఉచిత దర్శనం(Free Darshan) అవకాశం కల్పించారు. ఈ నిర్ణయం మంగళవారం నుంచే అమల్లోకి రానుంది. అధికారుల నిర్ణయం ప్రకారం.. భద్రాచలం స్థానికులు తమ గుర్తింపు కార్డును చూపి..
Telangana: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామిని దర్శించుకున్నారు. సోమవారం నాడు రామాలయానికి చేరుకున్న సీఎం రేవంత్ దంపతులకు దేవస్థానం అర్చకులు, సిబ్బంది ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం సీతారామచంద్ర స్వామి వారిని ముఖ్యంత్రి దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఉపాలయం లక్ష్మీ తాయారు అమ్మ వారి ఆలయంలో రేవంత్ దంపతులకు వేద ఆశీర్వాదం అందించారు.
పేదవాడి సొంతింటి కలను నెరవేర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. ‘‘ఇందిరమ్మ ఇల్లు’’ పథకం కార్యరూపం దాల్చనుంది. రాముల వారు కొలువైన ప్రసిద్ధ పుణ్యక్షేత్రం భద్రాచలంలో సోమవారం ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఈ పథకాన్ని ప్రారంభించనున్నారు.
నేడు యాదాద్రి, భద్రాద్రి జిల్లాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. భద్రాచలంలో ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. ఉదయం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారిని రేవంత్ దర్శించుకోనున్నారు. అనంతరం భద్రాచలం చేరుకుని శ్రీ సీతారమచంద్ర స్వామివారిని దర్శించుకోనున్నారు
సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) భద్రాచలం పర్యటన షెడ్యూల్ ఖరారైంది. మార్చి 11న యాదగిరి గుట్ట నుంచి రేవంత్ భద్రాచలానికి చేరుకోనున్నారు. మధ్యాహ్నం రాములవారిని దర్శించుకుంటారు.