Botsa SatyaNarayana: ఎందుకు ఈ ముసుగులో మాటలు
ABN , Publish Date - Jan 19 , 2025 | 07:34 PM
Botsa SatyaNarayana: విశాఖపట్నం స్టీల్ ప్లాంట్‌పై కేంద్ర ప్రభుత్వ అనుసరిస్తున్న వైఖరిపై వైసీపీ ఎమ్మెల్సీ, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ సందేహం వ్యక్తం చేశారు. ఆ క్రమంలో కేంద్ర వైఖరి ఏమిటనేది కూటమి ప్రభుత్వం స్పష్టం చేయడం లేదని ఆయన పేర్కొ్న్నారు.

విశాఖపట్నం, జనవరి 19: విశాఖపట్నం స్టీల్ ప్లాంట్‌కు రూ.11,440 కోట్ల ఆర్థిక ప్యాకేజీని కేంద్ర ప్రభుత్వం ప్రకటించడంపై వైసీపీ ఎమ్మెల్సీ, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ పలు సందేహాలు వ్యక్తం చేశారు. అందులోభాగంగా ఆదివారం విశాఖపట్నంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల విశాఖపట్నంలో పర్యటించారని.. ఆ సమయంలో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై ఆయన ఎందుకు మాట్లాడలేదని కూటమి ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించారు. అందుకు సంబంధించి తమకు ఎన్నో అనుమానాలున్నాయన్నారు. ప్యాకేజీ ఇచ్చారని కూటమి నేతలు అంటున్నారని.. కానీ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగిందని ఎందుకు చెప్పడం లేదంటూ ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా ఆయన సూటిగా ప్రశ్నించారు.
అయితే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేసే ఉద్దేశ్యంతోనే ఈ ప్యాకేజీ ఇచ్చారని తమ అభిప్రాయని ఆయన వ్యాఖ్యానించారు. ఎందుకు ఈ ముసుగులో మాటలు అంటూ కూటమి ప్రభుత్వంపై ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. కర్ణాటక స్టీల్ ప్లాంట్‌కు రూ.15 వేల కోట్లు ఇచ్చారని గుర్తు చేశారు.
అదికాక కర్ణాటక కన్నా .. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పెద్దదని.. అయినా తక్కువ ప్యాకేజీ మాత్రమే ఇచ్చారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్లాంట్‌పై కూటమి నేతలు యాక్షన్ ప్లాన్ ఏమిటని ఈ సందర్భంగా ఆయన ప్రశ్నించారు. అందులో మతలబు ఉందన్నారు. స్టీల్ ప్లాంట్ మనుగడ కోసం ఈ ప్యాకేజీ కాదన్నారు. ప్రజలను, కార్మికులను మోసం చేయడానికేనంటూ ఆయన మండిపడ్డారు.
Also Read : రోడ్డు ప్రమాదాలు.. 75 మందికి గాయాలు
తిరుపతిలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా టోకెన్ల జారీకి ముందు చోటు చేసుకొన్న తొక్కిసలాట.. ఆరుగురి మృతి ప్రభుత్వ అలసత్వం వల్లే జరిగిందని విమర్శించారు. కేంద్ర హోం శాఖ ఉన్నతాధికారులను సైతం రాష్ట్రానికి రాకుండా చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ఈ తిరుపతి ఘటనను సుమోటోగా తీసుకోవాలంటూ చీఫ్ జస్టిస్‌కు తాను లేఖ సైతం రాశానని ఈ సందర్భంగా బొత్స సత్యనారాయణ గుర్తు చేశారు.
Also Read : కిడ్నాప్ కేసు ఛేదించిన పోలీసులు.. నిందితులు అరెస్ట్
Also Read: ఢిల్లీ బయలుదేరి వెళ్లిన కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా
ఉత్తరప్రదేశ్‌లో జరుగుతోన్న కుంభమేళాకు కోట్లాది మంది ప్రజలు తరలి వస్తున్నారని.. వాటిని అక్కడి ప్రభుత్వం చక్కగా నిర్వహిస్తోందన్నారు. విశాఖ స్టీల్‌ను స్టీల్ అథారటీ ఆఫ్ ఇండియా (సెయిల్)లో విలీనం చేయాలన్నది తమ డిమాండ్ అని ఆయన స్పష్టం చేశారు. అయినా కేంద్ర హోం శాఖ మంత్రి రాష్ట్రానికి వచ్చినప్పుడు వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ ప్యాలెస్‌ల మీద మాట్లాడడం ఏమిటని బొత్స సత్యనారాయణ అసహనం వ్యక్తం చేశారు.
Also Read: తెలంగాణ ప్రజల త్యాగానికి అర్థం లేకుండా పోతుంది
Also Read: శుభలేఖలు పంచుతూ.. మృతు ఒడిలోకి..
విశాఖపట్నంలోని రుషికొండ భవనం ప్రభుత్వానిదని ఈ సందర్బంగా ఎమ్మెల్సీ బొత్స తెలిపారు. ఆయా భవనాలను ఎలా వాడుకోవాలనేది ప్రభుత్వ ఇష్టమన్నారు. అలాగే కూటమిలో ఎంత మందికి డిప్యూటీ సీఎంలు ఉండాలో వారి విధానం.. వారి ఇష్టమని బొత్స పేర్కొన్నారు. తమ ప్రభుత్వ హయంలో ఐదుగురుకి డిప్యూటీ సీఎం పోస్టులు ఇచ్చామని బొత్స సత్యనారాయణ ఈ సందర్భంగా వెల్లడించారు.
For Andhra Pradesh News And Telugu News