BTech Ravi : జగన్‌పై బీటెక్ రవి హాట్ కామెంట్స్
ABN , Publish Date - Feb 24 , 2025 | 07:15 PM
BTech Ravi : మాజీ సీఎం జగన్మోహన్‌రెడ్డికి పులివెందుల తెలుగుదేశం పార్టీ ఇన్‌చార్జి బీటెక్ రవి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ప్రతిపక్ష హోదా కోసం జగన్ డ్రామాలు ఆడుతున్నారని విమర్శించారు. ప్రజా సమ్యలు జగన్‌కు పట్టవా అని ప్రశ్నించారు.

కడప: మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై పులివెందుల తెలుగుదేశం పార్టీ ఇన్‌చార్జి బీటెక్ రవి హాట్ కామెంట్స్ చేశారు. జగన్ రెడ్డి అనే ఎమ్మెల్యే అసెంబ్లీకి వెళ్లడం కూడా ఒక చర్చనా.. అసెంబ్లీకి కేవలం సంతకం కోసం మాత్రమే వెళ్లారని చెప్పారు. రఘురామ కృష్ణమరాజు విషయంపై ఎప్పుడైతే చర్చించాడో అప్పుడే పదిమంది ఎమ్మెల్యేలకు భయం పుట్టిందని అన్నారు. ఏపీ సమస్యలు, పులివెందుల సమస్యలను అసెంబ్లీలో జగన్ వినిపిస్తే బాగుంటుందని తెలిపారు. ప్రతిపక్ష హోదా ఇవ్వకపోవడంతో జగన్ అసెంబ్లీని బాయికాట్ చేశారని అన్నారు. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజపేయి, జైపాల్ రెడ్డి, ఇలాంటి వారు ఒక సీటు రెండు సీట్లతోనే అసెంబ్లీలో తమ గొంతును వినిపించారని బీటెక్ రవి గుర్తుచేశారు.
బై ఎలక్షన్లకు తాము సిద్ధమే దమ్ముంటే 11 మందిని రాజీనామా చేయాలని సవాల్ విసిరారు. ఉప ఎన్నికల్లో పులివెందులలో కూడా జగన్మోహన్ రెడ్డి గెలవలేరని చెప్పారు. ఎంపీ అవినాష్ రెడ్డి జగన్ మోహన్ రెడ్డి అసెంబ్లీకి వెళ్తే సినిమా చూపిస్తారనడం విడ్డూరంగా ఉందని విమర్శించారు. వివేకం సినిమా చూశాం వివేకం టు ఏమన్నా చూపిస్తారా అని వ్యంగ్యంగా బీటెక్ రవి ప్రశ్నించారు. వైఎస్ కుటుంబ సభ్యులు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. ఎంపీగా అవినాష్ రెడ్డి గెలిచారంటే సునీత, షర్మిల ఫొటోలు ఇంట్లో ఉంచుకోవాలి లేకుంటే ఎంపీ పదవి కూడా దక్కేది కాదని చెప్పారు. వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో ఎవరు దద్దమ్మ కబుర్లు చెబుతున్నారో తెలుస్తాయని బీటెక్ రవి అన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
Minister Sathya Prasad: ప్రతిపక్ష హోదా కోసం జగన్ వితండవాదం.. మంత్రి అనగాని సెటైర్లు
YS Sharmila: 11 మందితో వచ్చింది 11 నిమిషాల కోసమా.. జగన్‌పై షర్మిల ఆగ్రహం
Somireddy: ఆ భయంతోనే అసెంబ్లీకి జగన్
Read Latest AP News And Telugu News