Home » Budget 2024
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్‌లో మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఎన్నికల ఏడాది సందర్భంగా ఇది పూర్తి బడ్జెట్ కాదు. లోక్‌సభ ఎన్నికల తర్వాత ఏర్పాటయ్యే కొత్త ప్రభుత్వం పూర్తి స్థాయి బడ్జెట్ ను ప్రవేశపెడుతుంది.
జీడీపీ అంటే గవర్నెన్స్, డవలప్‌మెంట్, పెర్ఫార్మెన్స్ అనే కొత్త అర్థాన్ని ప్రభుత్వం ఇచ్చిందని, ఆ దిశగా ప్రభుత్వం పట్టుదలతో పనిచేస్తుందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. 2024-25 తాత్కాలిక బడ్జెట్ ను లోక్‌సభలో ప్రవేశపెడుతూ, పేదలు, మహిళలు, యువత, అన్నదాతల స్థితిగతులను మెరుగుపరచేందుకు ప్రభుత్వం దృష్టి సారించిందని చెప్పారు.
Memes on Budget 2024: సోషల్ మీడియాలో మీమర్స్ ఏ రేంజ్‌లో రెచ్చిపోతారో మనందరికీ తెలిసిందే. వాళ్లు వీళ్లు అనే తేడా లేకుండా.. సందర్భం, సమయంతో పని లేకుండా.. ప్రతి అవకాశాన్ని తమకు అనుకూలంగా మార్చుకుని.. తమదైన శైలిలో ఆసక్తికరంగా, ఆకట్టుకునేలా మీమ్స్ చేస్తూ సోషల్ మీడియాలో వదిలేస్తుంటారు. ఎలాంటి స్పెషాలిటీ లేకుండానే.. ఎంతో రక్తి కట్టించే మీమర్స్.. ఎంతో కీలకమైన బడ్జెట్‌ను వదిలిపెడతారా? ఛాన్సే లేదు.
జై విజ్ఞాన్, జై కిసాన్, జై అనుసంధాన్ అన్నది మా ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగంలో భాగంగా వెల్లడించారు.
ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద రానున్న ఐదేళ్లలో గ్రామీణ ప్రాంతాల్లో మరో రెండు కోట్ల ఇళ్లు నిర్మిస్తామని నిర్మల తెలిపారు.
ప్రతి నెలా ఒకటో తేదీన దేశంలో ఎన్నో మార్పులు జరుగుతుంటాయి. ఈ మార్పుల ప్రభావం నేరుగా సామాన్యుల జేబులపైనే పడుతోంది. ఈ ఏడాది అప్పుడే జనవరి నెల ముగిసింది.
దేశంలో స్కిల్ ఇండియా మిషన్ ద్వారా 1.47 కోట్ల మంది యువత శిక్షణ పొందారని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామని బడ్జెట్ ప్రసంగంలో భాగంగా పేర్కొన్నారు.
2024 సంవత్సరానికిగానూ మధ్యంతర బడ్జెట్‌ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్‌సభలో ప్రవేశపెట్టారు. ఉదయం 11 గంటలకు ఆర్థిక మంత్రి సభలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ప్రస్తుతం బడ్జెట్ ప్రసంగాన్ని మంత్రి చదివి వినిపిస్తున్నారు.
అన్ని రంగాల్లోనూ దేశాభివృద్ధిపై నరేంద్ర మోదీ ప్రభుత్వం దృషి సారించిందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ప్రధానంగా నాలుగు వర్గాలు కేంద్ర ప్రాధాన్యమిచ్చిందని చెప్పారు. పేదలు, మహిళలు, యువత, అన్నదాతలను శక్తివంతం చేసిందన్నారు.
ప్రతి ఇంటికి నీరు, అందరికీ విద్యుత్, గ్యాస్, ఆర్థిక సేవలు, బ్యాంకు ఖాతాలు తెరిచేలా కృషి చేశామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. ఆహార సమస్యలు పరిష్కరించబడ్డాయని చెప్పారు.