Share News

KTR Letter: కంచ గచ్చిబౌలి భూములపై కేటీఆర్ సంచలన లేఖ.. కాంగ్రెస్‌కు మాస్ వార్నింగ్..

ABN , Publish Date - Apr 06 , 2025 | 05:31 PM

హెచ్‌సీయూ విద్యార్థుల పోరాటాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం తక్కువ చేసి చూపాలన్న కుట్రతో అనేక అపవాదులు వేస్తోందని ఎమ్మెల్యే కేటీఆర్ ఆరోపించారు. నిస్వార్థమైన విద్యార్థి-ప్రజా పోరాటాలు ఎప్పటికైనా విజయం సాధిస్తాయని ఆయన చెప్పారు.

KTR Letter: కంచ గచ్చిబౌలి భూములపై కేటీఆర్ సంచలన లేఖ.. కాంగ్రెస్‌కు మాస్ వార్నింగ్..
KTR Letter

హైదరాబాద్: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ విద్యార్థుల అపూర్వ పోరాటాన్ని తక్కువ చేసి చూపించే కుట్ర చేస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేసీఆర్ అన్నారు. విద్యార్థుల పోరాటంపై కాంగ్రెస్ ప్రభుత్వం అపవాదులు వేస్తోందని మండిపడ్డారు. కంచ గచ్చిబౌలి భూములను శాశ్వతంగా కాపాడుకుందామని కేటీఆర్ పిలుపునిచ్చారు. యూనివర్శిటీ తరలింపు, ఏకో పార్క్ అంటూ ప్రభుత్వం కుట్రలు చేస్తోందంటూ మండిపడ్డారు. నిస్వార్థంగా చేసే ఉద్యమాలు ఎప్పుడూ విజయం సాధిస్తాయని అన్నారు. భూముల కోసం పోరాటం చేసిన విద్యార్థులు, పర్యావరణ కార్యకర్తలు, వివిధ రంగాల ప్రముఖులు, మీడియాకు కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులు, పర్యావరణ ప్రేమికులు, ప్రజలకు కేటీఆర్ బహిరంగ లేఖ రాశారు.


కేటీఆర్ లేఖ ఇదే..

విద్యార్థుల పోరాటాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం తక్కువ చేసి చూపాలన్న కుట్రతో అనేక అపవాదులు వేస్తోందని కేటీఆర్ అన్నారు. నిస్వార్థమైన విద్యార్థి-ప్రజా పోరాటాలు ఎప్పటికైనా విజయం సాధిస్తాయని చెప్పారు. వందల రకాల జంతుజాలం, వృక్షజాతులతో ఉన్న ప్రాంతాన్ని కాపాడేందుకు, భవిష్యత్ తరాలకు అందించేందుకు వారు చేసి పోరాటానికి దేశవ్యాప్తంగా మద్దతు లభించిందని చెప్పుకొచ్చారు. విద్యార్థులతోపాటు దేశంలోని వివిధ రంగాల ప్రముఖులు కలిసి రావడం ఇందుకు నిదర్శనమన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం రియల్ ఎస్టేట్ దళారి మాదిరిగా ఆర్థిక ప్రయోజనాల కోసం ఆలోచించకుండా, భవిష్యత్ ప్రయోజనాల కోసం కంచ గచ్చిబౌలి వేలాన్ని పూర్తిగా విరమించుకోవాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.


అటెన్షన్ డైవర్షన్ కోసం బెదిరింపు ధోరణిలో ఎకో పార్క్ ఏర్పాటు, ఫోర్ట్ సిటీకి సెంట్రల్ యూనివర్సిటీ తరలింపు అంటూ ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి మొదలుకుని ప్రతి కాంగ్రెస్ నాయకుడి వరకూ పక్కా కుట్రతో మాట్లాడుతున్నారని కేటీఆర్ ఆరోపించారు. 50 సంవత్సరాలకు పైగా సెంట్రల్ యూనివర్సిటీ పర్యావరణ పరిరక్షణకు, విజ్ఞానానికి కేంద్రంగా నిలిచిందని చెప్పారు. కాంగ్రెస్ చెప్తున్న ఏకో పార్క్ కన్నా గొప్పగా పర్యావరణ సమతుల్యత కలిగిన క్యాంపస్‌గా హెచ్‌సీయూ నిలిచిందని వెల్లడించారు. విద్యార్థుల పోరాటం ఫలించి ప్రభుత్వం చేసిన పర్యావరణ హత్యను సుప్రీంకోర్టు అడ్డుకుందని, అయితే కాంగ్రెస్ సర్కార్ చేస్తున్న కుట్రల నేపథ్యంలో ఈ పోరాటం పూర్తిగా అయిపోలేదని లేఖలో పేర్కొన్నారు. 400 ఎకరాల పర్యావరణాన్ని కాపాడేందుకు పోరాటం ఇంకా మిగిలే ఉందని.. ప్రభుత్వ కుట్రలను, బెదిరింపులను, దుష్ప్రచారాన్ని దాటుకుని ముందుకు సాగాల్సిన అవసరం ఉందని కేటీఆర్ తెలియజేశారు. ఈ పోరాటానికి విద్యార్థులు, పర్యావరణవేత్తలు, ప్రముఖులు, తెలంగాణ ప్రజలు కలిసి రావాలని పిలుపునిచ్చారు.


బీఆర్ఎస్ పార్టీ తరఫున 400 ఎకరాల పర్యావరణ పరిరక్షణకు కట్టుబడి ఉన్నామని ప్రకటించిన విషయాన్ని కేటీఆర్ గుర్తు చేశారు. ప్రకృతికి విఘాతం కలగకుండా, యూనివర్శిటీకి ప్రమాదం రాకుండా బీఆర్ఎస్ పార్టీ.. విద్యార్థులకు అండగా ఉంటుందని కేటీఆర్ భరోసా ఇచ్చారు. సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల స్ఫూర్తిని, విద్యార్థుల ఆందోళనను దృష్టిలో ఉంచుకుని భూములు వేలం వేసే ప్రయత్నాన్ని విరమించుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే ప్రకటన చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. అప్పటిదాకా ప్రస్తుత పోరాటాన్ని కొనసాగిద్దామని కేటీఆర్ పిలుపునిచ్చారు.


మాజీమంత్రి జగదీశ్ రెడ్డి ఫైర్..

కంచ గచ్చిబౌలి భూముల వాస్తవాలను ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్(AI)కు ముడిపెట్టడం హాస్యాస్పదంగా ఉందని మాజీమంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు. ఫ్యూచర్ సిటీలో ఏఐ యూనివర్శిటీ పెడతామని చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి ఆ విషయంలో ముందుకు సాగుతారా? అంటూ ప్రశ్నించారు. హెచ్‌సీయూ మార్చుతామని ఇచ్చే లీకులు సైతం అనాలోచితంగా ఉన్నాయంటూ మండిపడ్డారు. ఈ విషయంలో కోర్టుకు వెళ్తామని కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తే చివాట్లు తప్పవని హెచ్చరించారు. కంచ గచ్చిబౌలి భూముల కేసును సుప్రీంకోర్టు సుమోటోగా తీసుకున్నప్పుడే.. ప్రభుత్వ పెద్దలు ఆలోచన మార్చుకోవాల్సిందని హితవుపలికారు. విద్యార్థులు, ప్రజలను తక్కువ అంచనా వేయడం సరికాదని చెప్పుకొచ్చారు.


ఈ వార్తలు కూడా చదవండి:

Sri Rama Navami Tragedy: ఘోర ప్రమాదం.. సీతారాముల కల్యాణం జరుగుతుండగా..

Krishna River Tragedy: పండగ వేళ ఘోర విషాదం.. కృష్ణానదిలో పడి.. బాబోయ్..

Mahesh Kumar Goud: మోదీ, అమిత్ షా అనుమతి లేకుండా బండి సంజయ్ టిఫిన్ కూడా చెయ్యరు: మహేశ్ కుమార్ గౌడ్

Updated Date - Apr 06 , 2025 | 06:48 PM