Share News

Srirama Navami Celebrations in Dubai: దుబాయిలో జై శ్రీరాం నినాదాలతో శ్రీ రామ నవమి ఉత్సవాలు

ABN , Publish Date - Apr 06 , 2025 | 04:57 PM

శ్రీరామ నవమి సందర్భంగా దుబాయిలోని భారతీయ నివసిత ప్రాంతాలు ఒక్కసారిగా కాషాయమయం అయ్యాయి. శ్రీ సీతారాముల కళ్యాణోత్సవంలో వందల మంది భక్తుల జయజయధ్వానాల నడుమ భక్తి భావం పెల్లుబికింది.

Srirama Navami Celebrations in Dubai: దుబాయిలో జై శ్రీరాం నినాదాలతో శ్రీ రామ నవమి ఉత్సవాలు
Srirama Navami Celebrations in Dubai

ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి ఇర్ఫాన్: ఎడారిలో ఆకాశహర్మ్యాల నగరమైన దుబాయిలోని భారతీయ నివసిత ప్రాంతాలు ఒక్కసారిగా కాషాయమయం అయ్యాయి. ఒక్కొక్కరుగా బయలుదేరిన భక్తజనాల ఉద్వేగభరిత జై శ్రీరాం నినాదాల మధ్య శ్రీరామ నవమి సందర్భంగా జరిగిన శ్రీ సీతారాముల కళ్యాణోత్సవంలో భక్తి భావం పెల్లుబికింది. దుబాయి, ఇతర ఎమిరేట్ల నుండి వచ్చిన వందలాది దంపతులతో ఆజ్మాన్‌లోని జైనం జీవిక వేదిక ప్రాంగణం కిక్కిరిసిపోయింది.

2.jpg


తెలంగాణ భక్తి బృందం ఆధ్వర్యంలో ఉదయం గణపతి పూజతో మొదలయిన కార్యక్రమం మధ్యాహ్నం హనుమాన్ చాలీసా పఠనంతో ముగిసింది. దుబాయిలోని స్థానిక వేదపండితులు సతీష్ బృందం వేదమంత్రాల ఘోషలో జరిగిన ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో తెలుగు ప్రవాసీ దంపతులు పాల్గొని రామాయణ పారాయణం చేసారని నవమి నిర్వాహకులలో ఒకరయిన తెలంగాణ ప్రవాసీ ప్రముఖులు గాజా నవినీత్, వంశీగౌడ్లు తెలిపారు.


శ్రీరామ నవమి వేడుక నిర్వహణ ఏర్పాట్లను ఆరే శరత్, కృష్ణా మేగి, మదన్ మోహన్, జగదీశ్‌లు సమన్వయం చేశారు. తలంబ్రాలు, ఇతర పూజ సామగ్రిని ప్రత్యేకంగా హైదరాబాద్ రామాలయం నుండి తెప్పించినట్లుగా నవనీత్ తెలిపారు.

ఇవి కూడా చదవండి:

ఒమాన్ తెలంగాణ సమితి అధ్వర్యంలో వైభవంగా ఉగాది వేడుకలు

బహ్రెయిన్‌లో ఘనంగా 43వ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

ఒమాన్‌లో మెగాస్టార్ అభిమానుల రక్తదాన శిబిరం

మరిన్ని ఎన్నారై వార్తల కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి

Updated Date - Apr 06 , 2025 | 05:01 PM