Cotton Clothing: కాటన్ దుస్తులు.. ఒరిజినలా? కాదా? ఎలా గుర్తించాలంటే..
ABN , Publish Date - Apr 06 , 2025 | 04:44 PM
Cotton Clothing: వేసవి వచ్చిందంటే.. చాలు ప్రతి ఒక్కరు కాటన్ దుస్తులు ధరించాలని అనుకొంటారు. ఆ క్రమంలో వాటిని కొనుగోలు చేస్తారు. అయితే వాటిలో అసలు కాటన్, నకిలీ దుస్తులు ఏవో చాలా మంది ఇట్టే పసిగట్ట లేరు.

వస్త్ర దుకాణాల్లో కాటన్ దుస్తులు విక్రయిస్తుంటారు. వాటిలో నాసి రకం నుంచి ఖరీదైన కూడా ఉంటాయి. అయితే నకిలీ కాటన్ దుస్తులను గుర్తుపట్టడం కోసం కొన్ని సులభమైన.. అలాగే వాస్తవిక పద్ధతులున్నాయి. ఈ పద్ధతులు.. మీరు షాపింగ్ చేసేటప్పుడు నాణ్యమైన కాటన్ దుస్తులను ఎంచుకోవడంలో సహాయపడతాయి.
దుస్తులపై లేబుల్‌ను జాగ్రత్తగా పరిశీలించాలి. 100 శాతం కాటన్ లేకుంటే ప్యూర్ కాటన్ అని స్పష్టంగా రాసి ఉండాలి. ఇక కొన్ని నకిలీ ఉత్పత్తులు సైతం ఇటువంటి లేబుల్‌లను ఉపయోగిస్తాయి. ఈ నేపథ్యంలో దీనిపై ఆధారపడ వద్దు. లేబుల్‌లో స్పెల్లింగ్ తప్పులు లేదా అస్పష్టమైన రాత ఉంటే సందేహించాల్సిందే.
దుస్తులను పరిశీలించి అంచనా వేయవచ్చు..
కాటన్ దుస్తులు సాధారణంగా మృదువుగా.. సహజంగా ఉంటాయి. శరీరానికి అత్యంత సౌకర్యంగా ఉంటాయి. వాటిని చేతితో తాకినప్పుడు జారడం.. లేదా ప్లాస్టిక్ వంటి అనుభూతి కలగకూడదు. అలా అయితే ఇది సింథటిక్ ఫైబర్స్ (పాలిస్టర్ వంటివి) అని చెప్ప వచ్చు. నిజమైన కాటన్ దుస్తులు కొంచెం గరుకుగా.. శ్వాస తీసుకునేలా ఉంటుంది. దుస్తులను ముఖానికి ఉంచి.. చూడండి. గాలి సులభంగా దుస్తుల ద్వారా వెళ్లుతోందా లేదా పరీక్షించండి.
వాసన ద్వారా పసిగట్ట వచ్చు:
కొత్త కాటన్ దుస్తులు సహజమైన, తేలికపాటి వాసన ఉంటుంది. నకిలీ దుస్తులలో సింథటిక్ ఫైబర్స్ ఉంటే.. కొన్నిసార్లు రసాయనిక లేదా ప్లాస్టిక్ వాసన వస్తుంది. దీనిని దుకాణంలోనే సున్నితంగా పరిశీలించవచ్చు.
దుస్తుల కుట్లు.. నాణ్యతను పరిశీలించండి..
ఒరిజినల్ కాటన్ దుస్తులలో కుట్లు (స్టిచింగ్) సమానంగా, బలంగా ఉంటాయి. నకిలీ దుస్తులలో కుట్లు వదులుగా, అసమానంగా ఉంటాయి. ఫాబ్రిక్ నాణ్యత కూడా తక్కువగా ఉంటుంది. అంచులు త్వరగా చిరిగిపోయేలా లేదా సన్నగా కనిపిస్తాయి.
బర్న్ టెస్ట్:
దుకాణంలో ఈ పరీక్ష చేయడం కష్టమైనప్పటికీ.. ఒక చిన్న థ్రెడ్ తీసుకుని (సాధ్యమైతే) దానిని కాల్చి చూడండి. నిజమైన కాటన్ కాగితం కాలినట్లు వాసన వస్తుంది. అనంతరం ఆ దారం బూడిదగా మారుతుంది. సింథటిక్ ఫైబర్స్ కరిగి, ప్లాస్టిక్ లాంటి బండగా మిగులుతాయి. అయితే దీనికి వస్త్ర దుకానం యజమాని అనుమతి తీసుకోవడం మంచిది.
ధరను పోల్చండి:
నాణ్యమైన కాటన్ దుస్తులు సాధారణంగా చౌకగా ఉండవు. ఒక దుకాణంలో సాధారణంగా తక్కువ ధర ఉంటే.. అది నకిలీ లేదా మిశ్రమ ఫాబ్రిక్ అయ్యే అవకాశం ఉంది. మార్కెట్ ధరలతో పోల్చి చూడండి.
వెలుగులో చూడండి:
దుస్తును వెలుగులో పట్టి చూస్తే, నిజమైన కాటన్ మాట్ (మెరుపు లేని) రూపాన్ని కలిగి ఉంటుంది. సింథటిక్ ఫాబ్రిక్‌లు తరచూ మెరుస్తాయి. లేదా షైన్‌గా ఉంటాయి. ఇది దుకాణంలో సులభంగా గామనించ వచ్చు.
Read Also: Travel Destinations: వేసవిలో కొత్త జంటలు చూడదగ్గ.. టాప్ 5 బడ్జెట్ ఫ్రెండ్లీ హనీమూన్ స్పాట్స్..
Chanakya Neeti: ఇలాంటి వాళ్లను నమ్మి ఇంటికి పిలిచారో అంతే..
Summer Tips: స్టైలిష్ లుక్ కోసం వేసవిలోనూ బూట్లు ధరిస్తున్నారా.. ఇలా చేస్తే