Budget 2024: పేదలు, మహిళలు, యువత, రైతులపై ప్రధానంగా దృష్టి: నిర్మలా సీతారామన్
ABN , Publish Date - Feb 01 , 2024 | 11:49 AM
అన్ని రంగాల్లోనూ దేశాభివృద్ధిపై నరేంద్ర మోదీ ప్రభుత్వం దృషి సారించిందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ప్రధానంగా నాలుగు వర్గాలు కేంద్ర ప్రాధాన్యమిచ్చిందని చెప్పారు. పేదలు, మహిళలు, యువత, అన్నదాతలను శక్తివంతం చేసిందన్నారు.
న్యూఢిల్లీ: అన్ని రంగాల్లోనూ దేశాభివృద్ధిపై నరేంద్ర మోదీ ప్రభుత్వం దృషి సారించిందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitaraman) తెలిపారు. ప్రధానంగా నాలుగు వర్గాలు కేంద్ర ప్రాధాన్యమిచ్చిందని చెప్పారు. పేదలు, మహిళలు, యువత, అన్నదాతలను శక్తివంతం చేసిందన్నారు. 2024-25 సంవత్సరానికి తాత్కాలిక బడ్జెట్‌ను (Union budget 2024)ను లోక్‌సభలో గురువారంనాడు మంత్రి ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆమె ప్రసంగిస్తూ, పేదరిక నిర్మూలనకు కేంద్ర బహుముఖీయ విధానాలతో పని చేస్తోందన్నారు. అభ్యుదయ భారతదేశ నిర్మాణ బాధ్యతకు కట్టుబడి ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. 'సబ్ కా సాథ్, సబ్ కా వికాస్, సబ్ కా విశ్వాస్' అనే మంత్రంతో అందర్నీ కలుపుకొని వెళ్తోందని చెప్పారు.
ప్రభుత్వ విజన్ ఇదే..
కుల, మత, ఆర్థిక భేదాలు లేకుండా అన్ని వర్గాల సమాన అవకాశాలు కల్పించడమే తమ విజన్ అని ఆర్థిక మంత్రి తెలిపారు. 2047 నాటికి అసమానత, పేదరికం కనబడకుండా చేయడం, వికసిత భారత్ ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. ప్రధాని ఆకాంక్షలను దృష్టిలో ఉంచుకుని పేదలు, మహిళలు, యువ త, అన్నదాతలపై మరింత దృషి సారించనున్నామని చెప్పారు. వారి అవసరాలు, ఆకాంక్షలకు అత్యధిక ప్రాధాన్యతనిస్తున్నామని తెలిపారు.