Home » Case
న్యూఢిల్లీ: సినీనటుడు, దర్శక, నిర్మాత మంచు మోహన్‌బాబుకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ముందస్తు బెయిల్‌పై విచారణ జరుగుతోందని, ఆ విచారణ ముగిసేంతవరకు మోహన్‌బాబును అరెస్ట్ చేయవద్దని సుప్రీం ధర్మాసనం ఆదేశించింది. జర్నలిస్టుపై దాడి కేసులో మోహన్‌బాబుపై హత్యాయత్నం కేసు నమోదైన విషయం తెలిసిందే.
ప్రకాశం జిల్లా: ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజుపై కస్టోడియల్ టార్చర్ కేసులో దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ కేసులో కామేపల్లి తులసి బాబును ప్రకాశం జిల్లా ఎస్పీ దామోదర్ విచారించనున్నారు. రఘురామ కృష్ణంరాజు గుండెలపై కూర్చొని టార్చర్ చేశాడని తులసి బాబుపై ఆరోపణలు ఉన్నాయి.
చట్టం తన పనిని తాను చేసుకోనివ్వకపోతే లాఠీలు పని చేయాల్సి ఉంటుందని బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ అన్నారు.
రఘురామ కృష్ణంరాజుపై కస్టోడియల్ టార్చర్ కేసులో శుక్రవారం విచారణకు రాలేనని కొంత సమయం కావాలని 7, 8 తేదీల్లో విచారణకు హాజరయ్యేందుకు సమయం ఇవ్వాలని నిందితుడిగా ఉన్న కామేపల్లి తులసిబాబు పోలీస్ అధికారులను కోరారు. ఈ మేరకు ఒంగోలు ఎస్పీకి లేఖ రాశారు.
కస్టోడియల్ టార్చర్ కేసుకు సంబంధించి విచారణకు పిలిచిన కామేపల్లి తులసిబాబును గుర్తించేందుకు తనకు అనుమతి ఇవ్వాలని డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు కోరారు. ఈ మేరకు కేసు విచారణ చేస్తున్న ప్రకాశం జిల్లా ఎస్పీ ఏఆర్.దామోదర్‌కు ఆయన లేఖ రాశారు.
బీజేపీ నుంచి తాను పెద్దమొత్తంలో డబ్బులు తీసుకున్నట్టు ఐదారు రోజుల క్రితం అతిషి ఆరోపించారని, గత 10-12 ఏళ్లుగా కాంగ్రెస్‌ను, తనను, తన కుటుంబాన్ని వాళ్లు టార్గెట్ చేసుకున్నారని సందీప్ దీక్షిత్ తెలిపారు.
వైఎస్సార్సీపీ సోషల్ మీడియా కేసుల్లో పులివెందుల పోలీసులు మరింత దూకుడు పెంచారు. వర్రా రవీందర్ రెడ్డి విచారణలో ఇచ్చిన వాంగ్మూలం మేరకు గుంటూరుకు చెందిన ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకొని పులివెందులకు తరలించారు. వర్ర రవీంద్రరెడ్డి సహా కీలక నిందితులను పోలీసులు ఇప్పటికే ప్రశ్నించారు.
ఫార్ములా ఈ కారు రేసు కేసులో బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్‌కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అధికారులు సమన్లు జారీ చేశారు.
ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇప్పటికే మధ్యంతర బెయిల్‌పై బయట ఉన్న ఏ-3 ఎన్.భుజంగరావు దాఖలు చేసిన రెగ్యులర్ బెయిల్ పిటిషన్‌పై హైకోర్టు గురువారం తీర్పు రిజర్వు చేసింది.
మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటుపై భూపాలపల్లి జిల్లా కోర్టులో ఉన్న కేసును కొట్టేయాలని కోరుతూ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావు హైకోర్టులో సోమవారం క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు.