Share News

Torture Case: రఘురామ కస్టోడియల్ టార్చర్ కేసు.. తులసిబాబు విచారణ

ABN , Publish Date - Jan 03 , 2025 | 08:25 AM

కస్టోడియల్‌ టార్చర్‌ కేసుకు సంబంధించి విచారణకు పిలిచిన కామేపల్లి తులసిబాబును గుర్తించేందుకు తనకు అనుమతి ఇవ్వాలని డిప్యూటీ స్పీకర్‌ రఘురామకృష్ణరాజు కోరారు. ఈ మేరకు కేసు విచారణ చేస్తున్న ప్రకాశం జిల్లా ఎస్పీ ఏఆర్‌.దామోదర్‌కు ఆయన లేఖ రాశారు.

Torture Case: రఘురామ  కస్టోడియల్ టార్చర్ కేసు.. తులసిబాబు విచారణ

ప్రకాశం జిల్లా: ఏపీ డిప్యూటీ స్పీకర్ (AP Deputy Speaker) రఘురామ కృష్ణంరాజు (Raghurama Krishnamraju) కస్టోడియల్ టార్చర్ కేసు (Custodial torture case)లో నిందితుడిగా ఉన్న కామేపల్లి తులసిబాబు (Kamepalli Tulasibabu)ను శుక్రవారం ఒంగోలు ఎస్పీ కార్యాలయంలో విచారించనున్నారు. హార్ట్ ఆపరేషన్ చేయించుకున్న రఘురామ గుండెలపై తులసిబాబు కూర్చొని టార్చర్ చేశాడని ఆరోపణ నేపథ్యంలో అతనిని ఈరోజు పోలీసులు విచారించనున్నారు. అయితే తులసిబాబును గుర్తించేందుకు విచారణకు హాజరౌతానని ఎస్పీకి డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు లేఖ రాశారు. ఈరోజు మధ్యాహ్నం ఒంటి గంటకు ఎస్పీ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని జిల్లా ఎస్పీ దామోదర్, తులసిబాబుకు నోటీసులు జారీ చేశారు.


రఘురామ కస్టోడియల్‌ టార్చర్‌ కేసు..

కాగా కస్టోడియల్‌ టార్చర్‌ కేసుకు సంబంధించి విచారణకు పిలిచిన కామేపల్లి తులసిబాబును గుర్తించేందుకు తనకు అనుమతి ఇవ్వాలని డిప్యూటీ స్పీకర్‌ రఘురామకృష్ణరాజు కోరారు. ఈ మేరకు కేసు విచారణ చేస్తున్న ప్రకాశం జిల్లా ఎస్పీ ఏఆర్‌.దామోదర్‌కు ఆయన లేఖ రాశారు. 2021 మే 14 రాత్రి సీఐడీ అధికారులు కస్టోడియల్‌ టార్చర్‌కు గురిచేసిన సమయంలో 115 కిలోల బరువు ఉన్న పొడవాటి వ్యక్తి తన ఛాతీపైన కూర్చున్నారని తనకు కొంతమంది చెప్పారని, ఆ వ్యక్తి తులసిబాబుగా భావిస్తున్నానని రఘురామ తెలిపారు. అతనిని ఈనెల 3న తన కేసులో విచారణకు పిలిచారని పత్రికలలో చూశానన్నారు. ప్రకాశం జిల్లాకు చెందిన తులసిబాబు అప్పట్లో సీఐడీ చీఫ్‌ సునీల్‌కుమార్‌ అవినీతికి చీఫ్‌ కలెక్షన్‌ ఏజెంటుగా, కుడి భుజంగా ఉండేవాడని తెలిసిందన్నారు. ప్రస్తుతం గుడివాడ టౌన్‌లో ఎమ్మెల్యే వెనిగండ్ల రాము కార్యాలయంలో కార్యకలాపాలు చూస్తున్నాడని తెలిపారు. అతనిని విచారణ పిలిచిన రోజు తనకు అనుమతి ఇస్తే గుర్తుపట్టగలనని ఆ లేఖలో పేర్కొన్నారు.


డాక్టర్‌ ప్రభావతికి ముందస్తు బెయిల్ నిరాకరణ...

రఘురామకృష్ణరాజును కస్టోడియల్‌ టార్చర్‌కు గురి చేసిన కేసులో 5వ నిందితురాలుగా ఉన్న డాక్టర్‌ ప్రభావతి దాఖలు చేసుకున్న ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ను కోర్టు తోసిపుచ్చింది. ఈ కేసులో పోలీసులు అరెస్టు చేయకుండా తనకు ముందస్తు బెయిల్‌ మంజూరు చేయాలని కోరుతూ డాక్టర్‌ ప్రభావతి దాఖలు చేసిన పిటిషన్‌పై ఇటీవల వాదనలు ముగిశాయి. మెడికల్‌ బోర్డు చైర్మన్‌గా ఉన్న తాను ఈ కేసుకు సంబంధించిన బోర్డులోని ఇతర వైద్యులిచ్చిన రిపోర్టుల ఆధారంగా నివేదిక ఇచ్చానని ఆమె పేర్కొన్నారు. తాను నిర్దోషినని అనారోగ్యంతో ఉన్నానని తెలిపారు. ఈ క్రమంలో ముందస్తు బెయిల్‌ మంజూరు చేయాలని కోరారు. కాగా, బాధితుడైన రఘురామ తన న్యాయవాదులు వినాలని ఇంప్లీడ్‌ పిటిషన్‌ వేశారు. ఆయన తరఫున న్యాయవాదులు వీవీ లక్ష్మీ నారాయణ, కావూరి గోపీనాథ్‌ వాదనలు వినిపించారు. కస్టడీలో తనపై జరిగిన హత్యాయత్నం కేసులో డాక్టర్‌ ప్రభావతి భాగస్వామి అయ్యారని, గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రి వైద్య బృందం ఇచ్చిన నివేదికను ఆమె దురుద్దేశంతో ట్యాంపరింగ్‌ చేశారని పేర్కొన్నారు. ఆమెకు ముందస్తు బెయిల్‌ మంజూరు చేయరాదని కోర్టును కోరారు. మరోవైపు, ఈ కేసులో ప్రాసిక్యూషన్‌ తరపున ప్రాసిక్యూషన్స్‌ జాయింట్‌ డైరెక్టర్‌ రాజేంద్రప్రసాద్‌ వాదనలు వినిపిస్తూ.. ప్రభావతి రాజ్యాంగబద్ధంగా వ్యవహరించాల్సింది పోయి మిగిలిన నిందితులతో కుమ్మక్కయ్యారని కోర్టుకు తెలిపారు. వాదనలు పరిగణనలోకి తీసుకున్న న్యాయస్థానం ప్రభావతికి ముందస్తు బెయిల్‌ మంజూరు చేసేందుకు నిరాకరించింది.


ఈ వార్తలు కూడా చదవండి..

హైదరాబాద్‌కు వస్తున్న ఏపీ సీఎం చంద్రబాబు..

వైజాగ్, విజయవాడకు డబుల్ డెక్కర్ మెట్రో..

450 కోట్ల స్కామ్‌లో టీమిండియా స్టార్

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Jan 03 , 2025 | 08:25 AM