Home » Chennai
సినిమాల్లో కథానాయకుడు... రాజకీయాల్లో నాయకుడు కావాలనే ఆశ, లక్ష్యం! ఎప్పటికప్పుడు రాజకీయ రంగ ప్రవేశానికి ఒక అడుగు ముందుకు వేస్తూనే... ‘ఇప్పుడు కాదు’ అంటూ రెండు అడుగులు వెనక్కి వేసిన నేపథ్యం! ఇప్పుడు... ఎట్టకేలకు ఈ కథానాయకుడు రాజకీయ నాయకుడిగా అవతరించాడు.
రాజుల కాలంలో అంతఃపుర మహిళలకు సేవ చేయడానికి వచ్చిన వారే తెలుగు వారని, అలా వచ్చిన వారంతా ఇపుడు తమది తమిళ జాతి అంటూ పెద్దపెద్ద మాటలు మాట్లాడుతున్నారని బీజేపీ మహిళా నాయకురాలు, తమిళ సినీ నటి కస్తూరి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
చెన్నైలో ఓ పారిశ్రామికవేత్త ఇంటిలో పనిచేస్తున్న 16 ఏళ్ల బాలిక చిత్ర హింసలకు గురై హతమైంది. ఈ హత్యకేసులో ఆ పారిశ్రామికవేత్త, ఆయన భార్య సహా ఆరుగురిని నగర పోలీసులు అరెస్టు చేశారు.
తమిళనాడు గవర్నర్‌ను వెంటనే రీకాల్ చేయాలని సీఎం స్టాలిన్ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
తమిళనాడులోని కోయంబత్తూరు జిల్లాలో ఉన్న ఈశా యోగా కేంద్రం వ్యవహారంలో ఇద్దరు మహిళలు అదృశ్యమైన కేసును మూసివేసిన సుప్రీంకోర్టు.. మిగిలిన ఫిర్యాదులపై పోలీసులు విచారణ చేపట్టవచ్చని పేర్కొంది.
చెన్నైకి ముప్పు తప్పింది. వాయుగుండం నేపథ్యంలో చెన్నై సహా 9 జిల్లాలకు ‘రెడ్ అలెర్ట్’ ప్రకటించిన వాతావరణశాఖ బుధవారం ఉపసంహరించుకుంది.
తమిళనాడులోని తిరుచ్చి నుంచి షార్జాకు బయలుదేరిన విమానానికి పెద్ద ముప్పు తప్పింది. 141 మంది ప్రయాణికులు ఉన్న ఆ విమానం సాంకేతిక లోపంతో రెండు గంటల పాటు గాల్లో చక్కర్లు కొట్టి.. చివరకు క్షేమంగా కిందకు దిగడంతో ఉత్కంఠకు తెరపడి అంతా ఊపిరి పీల్చుకున్నారు.
అసలే ఆదివారం..పైగా బీచ్‌లో మెగా ఎయిర్‌షో..! ఇంకేముంది ఉదయం 8గంటల నుంచే చెన్నై మెరీనా బీచ్‌కు జనం పోటెత్తారు. చెన్నైతోపాటు చుట్టుపక్కల ప్రాంతాల వారూ లక్షలాదిగా తరలిరావడంతో బీచ్‌కు వెళ్లే దారులన్నీ జనంతో కిటకిటలాడాయి.
తిరుగు ప్రయాణంలో ఇసుకేస్తే రాలనంత రద్దీ, ఉక్కపోతతో సుమారు 230 మంది స్పృహ తప్పి పోయినట్టు తెలుస్తోంది. వీరిలో 93 మంది పరిస్థితి విషమంగా ఉండటంతో సమీప ఆసుపత్రులకు తరలించారు.
ప్యారీస్‌లోని చెన్నకేశవ పెరుమాళ్ ఆలయంలో తిరుమల(Tirumala) గొడుగుల ఊరేగింపును తిరుకంకుడి జీయర్ రామానుజ స్వామి బుధవారం ప్రారంభించారు. తిరుమల బ్రహ్మోత్సవాల(Tirumala Brahmotsavams) సందర్భంగా నగరానికి చెందిన హిందూ ధర్మార్ధ సమితి ప్రతి ఏటా శ్రీవారికి గొడుగులు సమర్పించడం ఆనవాయితీ.