Trains: తెలుగు రాష్ట్రాల్లో.. పలు ఎక్స్‌ప్రెస్ రైళ్లకు అదనపు హాల్ట్‌లు
ABN , Publish Date - Feb 05 , 2025 | 12:23 PM
ఆంధ్రప్రదేశ్, తెలంగాణా(Andhra Pradesh, Telangana) రాష్ట్రాల్లో పలు ఎక్స్‌ప్రెస్ రైళ్లకు అదనపు హాల్ట్ కల్పించినట్లు దక్షిణ రైల్వే(Southern Railway) ఒక ప్రకటనలో తెలిపింది.

చెన్నై: ఆంధ్రప్రదేశ్, తెలంగాణా(Andhra Pradesh, Telangana) రాష్ట్రాల్లో పలు ఎక్స్‌ప్రెస్ రైళ్లకు అదనపు హాల్ట్ కల్పించినట్లు దక్షిణ రైల్వే(Southern Railway) ఒక ప్రకటనలో తెలిపింది. నెం.12522 ఎన్నాకుళం-బరౌని రప్తిసాగర్ ఎక్స్‌ప్రెస్ ఈ నెల 7వ తేది నుంచి చీరాల స్టేషన్‌లో ఆగనుంది. నెం.16004 నాగర్‌సోల్-డా.ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ ఎక్స్‌ప్రెస్ మహబూబ్‌నగర్‌లోను, నెం.22101 లోకమాన్య తిలక్ టెర్మిన్‌స-మదురై ఎక్స్‌ప్రెస్ గుత్తిలో, నెం. 11017 లోకమాన్య తిలక్-కారైక్కాల్ ఎక్స్‌ప్రెస్ గుత్తి, తాడిపత్రి(Gooty, Tadipatri), నెం.22669 ఎర్నాకుళం-పాట్నా సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ ఖమ్మం, నెం.12656 డా.ఎంజీఆర్ చెన్నై సెంట్రల్-అహ్మదాబాద్ నవజీవన్ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ పెద్దపల్లి రైల్వేస్టేషన్‌లో ఆగనున్నాయి.
ఈ వార్తను కూడా చదవండి: Death certificate: భర్త బతికుండగానే డెత్ సర్టిఫికెట్..
అలాగే, నెం.12655 అహ్మదాబాద్- చెన్నై సెంట్రల్ నవజీవన్ ఎక్స్‌ప్రెస్, నెం.12611 సెంట్రల్-హజ్రత్ నిజాముద్దీన్ గరీభ్ రథ్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు వరంగల్, నెం.12603 చెన్నై సెంట్రల్-హైదరాబాద్ ఎక్స్‌ప్రెస్ సత్తెనపల్లి, పిడుగురాళ్ల, నడికుడి, మిర్యాలగూడ, నల్గొండ(Sattenapalli, Piduguralla, Nadikudi, Miryalaguda, Nalgonda), నెం.17643 చెంగల్పట్లు-కాకినాడ పోర్ట్ సర్కార్ ఎక్స్‌ప్రెస్ మంగళగిరి, న్యూ గుంటూరు రైల్వేస్టేషన్(Guntur Railway Station)లో ఆగుతాయని దక్షిణ రైల్వే తెలిపింది.
ఎక్స్‌ప్రెస్ రైళ్లకు అదనపు బోగీలు...
- నెం.22624/22623 మదురై-తాంబరం-మదురై సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఈ నెల 6 నుంచి 20వ తేది వరకు అదనంగా రెండు ఏసీ త్రీ టైర్, రెండు జనరల్ సెకండ్ క్లాస్ బోగీలు అనుసంధానం చేయనున్నట్లు అధికారులు తెలిపారు.
వార్తను కూడా చదవండి: ఎంపీ అరవింద్ వ్యాఖ్యలపై మంత్రి తుమ్మల ఘాటు రిప్లై
ఈవార్తను కూడా చదవండి: మంత్రి పొంగులేటికి తప్పిన పెను ప్రమాదం.. అసలేం జరిగిందంటే..
ఈవార్తను కూడా చదవండి: చిక్కరు.. దొరకరు!
ఈవార్తను కూడా చదవండి: ఆయన బతికే ఉన్నారు.. మావోయిస్టుల సంచలన లేఖ
Read Latest Telangana News and National News